
తిరుపతిలో తిష్ట వేసేదెవరు.?
•వైసిపి అడ్డాగా తిరుపతి మారనుందా..
ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కంటే తిరుపతి జిల్లా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక నగరిగా పేరుపొందిన తిరుపతిలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి అత్యధిక పర్యాయాలు ఇక్కడి నుంచి కాంగ్రెస్ విజయం సాధించింది. రాష్ట్ర విభజన తర్వాత 2014,19 సాధారణ ఎన్నికల్లో, 2021 ఉప ఎన్నికల్లో వైసిపి వరుస విజయాలను అందుకుంది. ఈ విధంగా వైసిపి కంచుకోట అయినటువంటి తిరుపతి పార్లమెంటు పరిధిలో ఈసారి ఎవరి బలం ఎంత ఉండబోతుంది అనేది తెలుసుకుందాం.
సూళ్లూరుపేట:
కిలివేటి సంజీవయ్య Vs విజయశ్రీ
తిరుపతిలోని కీలక నియోజకవర్గాల్లో సూళ్లూరుపేట కూడా ఒకటి. ఇక్కడ వైసిపి అభ్యర్థి బలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
గూడూరు:
మురళీధర్ Vs సునీల్ కుమార్
ఇక్కడ కూడా వైసీపీకే ఎక్కువ పట్టు ఉండే అవకాశం కనిపిస్తోంది. గతంలో వైసిపి అభ్యర్థి అభివృద్ధి ఎక్కువగా జరగడం వల్ల ప్రజలు వైసీపీకే సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
వెంకటగిరి:
రామ్ కుమార్ రెడ్డి Vs లక్ష్మీ సాయి ప్రియ
ఇక ఈ నియోజకవర్గంలో వైసిపిని బీట్ చేసి టిడిపి ముందు స్థానంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది.
సత్యవేడు :
రాజేష్Vs ఆదిమూలం:
సత్యవేడు నియోజకవర్గం లో కూడా ఈసారి వైసిపి తన జెండా ఎగరవేయబోతుందట.
శ్రీకాళహస్తి:
మధుసూదన్ రెడ్డిVs వెంకట సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి నియోజకవర్గం లో వైసీపీలో ఏర్పడిన వర్గ పోరు వల్ల టిడిపికి కాస్త ఫేవర్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది.
తిరుపతి:
అభినయ రెడ్డి Vs శ్రీనివాసులు
ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో తిరుపతి నియోజకవర్గంలో చాలా కీలకమైనది. ఈ నియోజకవర్గంలో కూడా వైసిపి అభ్యర్థి విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది.