కోహ్లీ అవుట్ కరెక్టే.. స్టార్ స్పోర్ట్స్ కీలక వ్యాఖ్యలు?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నేటితరం క్రికెటర్లలో ఎవరికి సాధ్యం కాని రీతిలో సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకున్నాడు. అందుకే కోహ్లీకి సంబంధించిన ఏ విషయం ఇంటర్నెట్ లోకి వచ్చిన అది తెగ వైరల్ గా మారిపోయి ప్రపంచమంతా పాకి పోతూ ఉంటుంది. అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు కోహ్లీ గురించి ఇలాంటి ఒక విషయమే ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది.

ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్  జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అవుట్ అయిన విధానం ఇక చర్చనీయాంశంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఒక రకంగా ఇది చిన్న పాటి వివాదంగా మారిపోయింది. ఇక ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. ఏకంగా నడుం కంటే పైకి బంతి వచ్చినా కూడా నోబాల్ ఇవ్వకుండా విరాట్ కోహ్లీని అవుట్ గా ఎలా ప్రకటించారు అన్న విషయంపై చర్చ జరుగుతుంది. కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో అంపైర్ల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

 అయితే ఇది రూల్ ప్రకారం జరిగిందని కొంతమంది అంటుంటే.. రూల్స్ కి విరుద్ధంగా జరిగిందని మరి కొంతమంది అంటున్నారు. ఇదే విషయం గురించి స్టార్ స్పోర్ట్స్ స్పందించింది. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫుల్ టాస్ బంతికి అవుట్ కావడం ఐపీఎల్ రూల్స్ ప్రకారం కరెక్టే అంటూ తెలిపింది. బంతి విరాట్ నడుము కంటే ఎక్కువ పైకి వచ్చింది అన్నమాట నిజమే. అయితే కోహ్లీ క్రీజ్ దాటి ముందుకు రావడంతో అతన్ని అవుట్గా పరిగణించారు అంటూ పేర్కొంది స్టార్ స్పోర్ట్స్. ఒకవేళ క్రీజ్ దాటి ఉండకపోయి ఉంటే బంతి నడుము కంటే తక్కువ ఎత్తుకు వచ్చేదని తెలిపింది. అయితే దానిని నో బాల్ గా ప్రకటించకపోవడంతో అటు విరాట్ కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: