అమ్మాయిని పెళ్లి చేసుకున్న మహిళా క్రికెటర్.. ఫ్యాన్స్ షాక్?
ఏకంగా ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు రెడీ అయింది. దీంతో ప్రస్తుతం ఇక ఈ పెళ్లి గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అదేంటి ఇక మహిళా క్రికెటర్ కు పెళ్లి కావడం సర్వసాధారణమే. కొంతమంది లవ్ మ్యారేజ్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇందులో పెద్దగా చర్చించుకోవడానికి ఏముంది అని అనుకుంటున్నారు కదా. అయితే ఆ మహిళా క్రికెటర్ ప్రేమించి పెళ్లి చేసుకుంది పురుషుడిని కాదు ఏకంగా మరో మహిళనే. వినడానికే షాకింగ్ గా ఉంది కదా.. కానీ ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఇదే చేసింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న ఉమెన్ క్రికెటర్ యాష్లే గార్డినర్ తన స్నేహితురాలు మోనికా రైట్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన నిశ్చితార్థ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే 2017 నుంచి వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ లివింగ్ రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నారు. ఇటీవలే వారి బంధానికి ఇక ప్రమోషన్ ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. కాగా యాష్లే గార్డ్ నర్ ఆస్ట్రేలియా జట్టులో బౌలింగ్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నారు.