నాగార్జున మూవీ ని కాజల్ ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కొన్ని సార్లు కొన్ని ఆఫర్లు చేజారుతో వెళుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు హిట్ అయితే మరిక్కొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీవలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్ లలో కాజల్ అగర్వాల్ ఒకరు. చందమామ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తెలుగులో మంచి గుర్తింపును ఈ బ్యూటీ సంపాదించుకుంది. ఆ తర్వాత మగధీర లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించి ఒక్క సారిగా తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇకపోతే ఈ బ్యూటీ కూడా తన కెరియర్ లో చాలా మూవీ లను వదులుకుంది.

అందులో ఒకటి రగడ మూవీ. ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా నటించగా ... వీరు పోట్లా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అనుష్క , ప్రియమణి హీరోయిన్ లుగా నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని దక్కించుకుంది. ఇకపోతే ఈ మూవీ లో ప్రియమణి నటించిన పాత్ర కోసం మొదటగా ఈ మూవీ బృందం కాజల్ అగర్వాల్ ను అనుకుందట.

అందులో భాగంగా ఈమెకు ఈ సినిమా యొక్క కథను కూడా వివరించారట. ఇందులో ప్రియమణి పాత్ర ఈమెకు బాగానే నచ్చినప్పటికీ ఆ సమయంలో ఈ బ్యూటీ ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడంతో ఈ మూవీ లో నటించలేదట. దానితో ఈ మూవీ బృందం ప్రియమణి ని సంప్రదించడం ... ఈమె దానిని ఓకే చేయడం జరిగిపోయింది. ఇకపోతే రగడ సినిమాలో ప్రియమణి తన నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కించింది. ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: