చరిత్ర సృష్టించిన నరైన్.. ఐపీఎల్ లో ఒకే ఒక్కడు?

praveen
సునీల్ నరైన్.. 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి కూడా ఈ పేరు తెగ మారుమోగిపోతూ ఉంది. ఎందుకంటే ఇక బ్యాటింగ్లో ఇతని సృష్టిస్తున్న విధ్వంసం అలాంటిది. ఇతను వాస్తవానికి బ్యాట్స్మెన్ కాదు కేవలం  పార్ట్ టైం బ్యాట్స్మెన్ మాత్రమే. ఇక స్పిన్నర్ గానే ఇతను అందరికీ సుపరిచితుడు. కానీ ఇలాంటి స్పిన్నర్ పైన నమ్మకం ఉంచిన గౌతమ్ గంభీర్ ఏకంగా ఓపెనర్ గా బరిలోకి దింపి అతని బ్యాటింగ్ మెరుపులు ఏంటో అందరికీ అర్థం అయ్యేలా చేస్తూ ఉన్నాడు.

 అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటింగ్లో పెద్దగా రాణించిన దాఖలాలు లేని సునీల్ నరైన్ అటు ఐపిఎల్ లో మాత్రం బ్యాటింగ్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఇక ప్రతి బంతిని బౌండరీగా మలచడమే లక్ష్యంగా బ్యాట్ జులిపిస్తున్నాడు. ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో అయితే ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయాడు. కోల్కతా జట్టు ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ అటు సునీల్ నరైన్ సృష్టించిన విధ్వంసం మాత్రం అభిమానులు బాగా గుర్తుపెట్టుకున్నారు. అయితే ఈ సెంచరీ తో నరైన్ ఐపీఎల్లో ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు అని చెప్పాలి. ఇప్పటివరకు ఏ ప్లేయర్కు సాధ్యం కానీ సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశాడు.

 ఐపీఎల్ లో సెంచరీ తో పాటు హ్యాట్రిక్ తీసిన మూడో ప్లేయర్గా సునీల్ నరైన్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు షేన్ వాట్సన్, రోహిత్ శర్మ ఈ ఘనత సాధించిన ప్లేయర్లుగా ఉన్నారు అని చెప్పాలి. అయితే ఐపీఎల్లో ఐదు వికెట్ల హాల్ సంపాదించడంతోపాటు ఏకంగా సెంచరీ కూడా నమోదు చేసిన ఏకైక ప్లేయర్గా సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. కాగా ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో కేవలం 56 బంతుల్లోనే 16 పరుగులు చేసి సెంచరీ తో కదం తొక్కాడు ఈ ప్లేయర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: