హార్దిక్ నటిస్తున్నాడు.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్?

praveen
ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తున్నాడు. అయితే ముంబై జట్టును ఛాంపియన్ టీం గా నిలిపి ఐదు సార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను ఆ జట్టు యాజమాన్యం అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ నిర్ణయంతో రోహిత్ అభిమానులు మాత్రమే కాదు సగటు క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఫీలయ్యారు. రోహిత్ లాంటి కెప్టెన్ కావాలని అన్ని టీమ్స్ కోరుకుంటుంటే అలాంటి కెప్టెన్ ను తొలగించడం ఏంటి అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

 రోహిత్ ఫ్యాన్స్ అయితే ఇక ముంబై ఇండియన్స్ ని సపోర్ట్ చేయబోము అంటూ ఏకంగా సోషల్ మీడియా ఖాతాలను కూడా అన్ ఫాలో చేశారు. కాగా రోహిత్ ను కెప్టెన్సీ నుంచి మార్చి ఇక హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి కూడా అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కూడా అతను ఫెయిల్ అవుతూ ఉండడంతో ఈ విమర్శలు మరింత తారస్థాయికి చేరుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. దీనికి తోడు అతను ఇక జట్టుకు బౌలర్ గా కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఎంతోమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఇదే విషయం గురించి ఇంగ్లాండు మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు.

 హార్దిక్ పాండ్యాను ఎగతాళి చేయడాన్ని ప్రేక్షకులు ఇంకా మానుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు.  దీని కారణంగానే హార్దిక్ పాండ్యా ఆటతీరు, కెప్టెన్సీ దెబ్బతింటుంది అంటూ అభిప్రాయపడ్డాడు. టాస్ కు వచ్చేటప్పుడు హార్దిక్ పాండ్యా ఎక్కువగా నవ్వుతూ చాలా సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నాడు. కానీ అతను సంతోషంగా లేడు. అలాంటి పరిస్థితులను నేను కూడాఎదుర్కొన్నాను. ఒక టీమిండియా ప్లేయర్కు ఇలా చేయడం సరికాదు అంటూ కెవిన్ పీటర్సన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: