
ఆ జట్టుకు కెప్టెన్సీ వహించడం.. నా దురదృష్టం : డీకే
అయితే ఇలా ఒకప్పుడు మోస్ట్ అన్ లక్కీ ప్లేయర్ అని పిలిపించుకున్న దినేష్ కార్తీక్ ఇక ఇప్పుడు మాత్రం లక్కీ ప్లేయర్ అనిపించుకుంటున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు. ఏకంగా మెరుపు ఇన్నింగ్స్ తో అసలు సిసలైన ఫినిషింగ్ అంటే ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇలాంటి ఆటతోనే 2022 t20 వరల్డ్ కప్ లో కూడా చోటు దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక అంతకుముందు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గా కూడా ఐపీఎల్ లో ప్రస్థానాన్ని కొనసాగించాడు దినేష్ కార్తీక్.
అయితే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్సీ చేపట్టడం నిజంగా తన దురదృష్టం అంటూ ఇటీవలే దినేష్ కార్తీక్ చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి. కోల్కతా కెప్టెన్ గా ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్ రాణించలేదని.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు దినేష్ కార్తీక్. దీంతో అతడిని బెంచ్ కే పరిమితం చేసినట్లు తెలిపాడు. ఆ సమయంలో అతనితో మాట్లాడటం ఇబ్బందిగా అనిపించేది అంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను దాటుకొని కుల్దీప్ బౌలర్గా గా ఎదిగాడు అంటూ దినేష్ కార్తీక్ గుర్తు చేసుకున్నాడు. ఫామ్ లో లేని సమయంలో తాను కోల్కతాకు కెప్టెన్సీ వహించాల్సి వచ్చిందని.. ఇక ఆ సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయని.. ఇలా ఫామ్ లో లేని సమయంలో కెప్టెన్సీ వహించడం నా దురదృష్టం అంటూ అభిప్రాయపడ్డాడు డీకే.