మా ఓటమికి అసలు కారణం అదే : రుతురాజ్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ప్రతి ఏడాది కూడా మహేంద్ర సింగ్తోని సారధిగా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అతని సారథ్యంలోనే ఐదుసార్లు టైటిల్స్ కూడా గెలుచుకుంది చెన్నై టీమ్. అయితే ధోని కెరియర్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో.. ఈ ఏడాది సీఎస్కే యువ ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ చేతికి సారధ్య బాధ్యతలు అందించాడు ధోని. ఇక అతని సాధ్యంలోనే ప్రస్తుతం వరుసగా మ్యాచ్ లు ఆడుతుంది టీమ్ ఇండియా.

 అయితే ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత మొదట వరుసగా విజయాలు సాధించి అదరగొట్టిన టీమిండియా.. ఆ తర్వాత మాత్రం ఎందుకో తమ ఆట తీరతో ఆకట్టుకోలేక పోతుంది అని చెప్పాలి. వరుస ఓటములు చవి చూస్తూ ఇక అభిమానులందరిని కూడా నిరాశ పరుస్తుంది. టైటిల్ వేటలో అంతకు అంతకు వెనకబడిపోతుంది. ఇకపోతే ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి వరకు విజయం కోసం పోరాడినప్పటికీ.. చివరికి ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే సన్రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓటమిపై ఋతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవర్ ప్లే లో హైదరాబాద్ జట్టును కట్టడి చేయకపోవడమే తమ ఓటమికి ప్రధాన కారణం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ పిచ్ చాలా స్లోగా ఉంది. హైదరాబాద్ బౌలర్లు  పరిస్థితులకు చక్కగా ఉపయోగించుకున్నారు. ఇది నల్ల రేగడి పిచ్ కావడంతో స్లోగా ఉంది అని ముందే అంచనా వేసాం. కానీ మ్యాచ్ జరుగుతున్న కొద్ది మరింత నెమ్మదిగా మారింది. మేము ఫీల్డింగ్ లో కూడా తప్పిదాలు చేశాం అంటూ ఋతురాజ్ చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేసాం అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: