IPL 2024లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ బాగా ఆడుతూ నిలకడగా రాణిస్తోంది. ఇప్పటి దాకా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కూడా రెండు మ్యాచ్‌లు ఆడి గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.అయితే ఈ లీగ్ మధ్యలోనే ఆ టీంకి పెద్ద షాక్ తగిలింది. ఆ టీం స్టార్ ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి మొత్తం లీగ్‌కు దూరమవ్వడం జరిగింది. పక్కటెముక గాయం నుంచి ఇంకా సరిగ్గా కోలుకోకపోవడంతో ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
ఆగస్ట్ 2023 నుంచి ఈ గాయంతో బాధపడుతున్న మావి, లీగ్ ప్రారంభం నాటికి కోలుకుంటాడని అంతా భావించారు. అయితే అది మాత్రం సాధ్యం కాలేదు. కాగా గత ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన శివమ్ మావికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత మినీ వేలానికి ముందే గుజరాత్ టీం నుంచి మావి విడుదలయ్యాడు. అక్కడ లక్నో సూపర్ జెయింట్స్ టీం అతన్ని కొనుగోలు చేసింది. మినీ వేలంలో మావిని లక్నో జట్టు ఏకంగా రూ. 6.4 కోట్లకు కొనుగోలు చేసింది. అవేష్ ఖాన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు లక్నో ఇంత మొత్తానికి మావిని కొనుగోలు చేసింది. కానీ మావి ఇప్పటి దాకా లక్నో తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.మావి ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడన్న విషయాన్ని లక్నో టీం ఫ్రాంచైజీ మీడియాకు తెలియజేసింది .
'గత డిసెంబర్ నెలలో జరిగిన వేలంలో మా జట్టులో చేరిన ప్రతిభావంతుడైన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి ఇప్పటి దాకా మా జట్టు నిర్వహించిన శిబిరంలో పాల్గొన్నాడు. ఈ సీజన్లో మావి జట్టుకు కీలక ఆటగాడిగా మారతాడని భావించాం. అయితే ఇప్పుడు అతడు అందుబాటులో లేకపోవడంతో అందరం ఎంతో నిరాశ చెందుతున్నాం'.అని తెలిపింది.
లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు విషయానికి వస్తే..కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరా మాన్కా. యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతమ్, అర్షిన్ కులకర్ణి, M. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, మాట్ హెన్రీ ఇంకా మొహమ్మద్ అర్షద్ ఖాన్ ఆడనున్నారు.