ఈ మ్యాచ్ తో అయిన హర్ధిక్ కెప్టెన్ గా నిరూపించుకుంటాడా..?

frame ఈ మ్యాచ్ తో అయిన హర్ధిక్ కెప్టెన్ గా నిరూపించుకుంటాడా..?

Pulgam Srinivas
"ఐ పీ ఎల్" సీజన్ ప్రారంభం అవుతుంది అంటే ముంబై ఇండియన్స్ జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటుంది. ప్రతి సారి లాగానే ఈ సారి కూడా ముంబై ఇండియన్స్ జట్టు భారీ అంచనాలతో "ఐ పి ఎల్" సీజన్ లోకి అడుగు పెట్టింది. క్రేజీ టీం గా "ఐ పి ఎల్ 2024" సీజన్ లోకి అడుగు పెట్టిన ఈ టీం కు మొదటి నుండి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటి వరకు ఈ జట్టు రెండు మ్యాచ్ లను అడగా ... రెండిటిలో కూడా ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో చుట్ట చివరి స్థానంలో ఉంది.


ఇక ముంబై ఇండియన్స్ ను తప్పిస్తే ఐపీఎల్ 2024 లో ఉన్న టీం లు అన్ని కూడా ఇప్పటికే పాయింట్స్ పట్టికలో ఖాతాను తెరిచి ముందుకు దూసుకుపోతున్నాయి. ఇకపోతే సన్రైజర్స్ టీం ముంబై ఇండియన్స్ జట్టుపై భారీ స్కోరును సాధించడంతో ఈ టీం పై మరింత ప్రేజర్ పెరిగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుత ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈయన కెప్టెన్సీ వల్లే ముంబై జట్టు వరస అపజాయలను ఎదుర్కొంటుంది అని ముంబై జట్టు అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.


ఇకపోతే ఈ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకి ముంబై ఇండియన్స్ కు మరియు రాజస్థాన్ రాయల్స్ కు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో కనుక ముంబై గెలిచినట్లు అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కి ఏ డొక ఉండదు. ఒక వేళ హార్దిక్ నేతృత్వంలో ఈ రోజు బరిలోకి దిగనున్న ముంబై జట్టు ఈ రోజు మ్యాచ్ లో కూడా ఓడిపోయినట్లు అయితే హార్దిక్ కెప్టెన్సీ కి పెద్ద ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు అభిమానులు ఈ రోజు రాజస్థాన్ పై ముంబై జట్టు భారీ తేడాతో గెలుపొందాలి అని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

hp

సంబంధిత వార్తలు: