ఐపీఎల్ : ఐసీసీ రూల్ ని పక్కన పెట్టిన బీసీసీఐ?
ఇప్పటికే అటు ఐసీసీ రూల్స్ లో లేని ఇంపాక్ట్ ప్లేయర్ అనే రూల్ ని ఐపీఎల్ లో అమలు అవుతుంది. ఈ రూల్ ద్వారా మ్యాచ్ మధ్యలో ఎవరైనా ఆటగాడిని మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఐసీసీకి సంబంధం లేని మరో కొత్త రూల్ ని అటు బీసీసీఐ ఐపీఎల్ లో ప్రవేశపెట్టబోతుందట. ఏకంగా బౌలర్ రెండు షార్ట్ బౌన్సర్లు వేసేందుకు అనుమతించబోతున్నారు. ఐసీసీ రూల్స్ ప్రకారం కేవలం బౌలర్ ఒక ఓవర్ కి ఒక్క బౌన్సర్ మాత్రమే వేసేందుకు అవకాశం ఉంటుంది.
ఇక ఇలా ఒక బౌన్సర్ తర్వాత బౌలర్ మరో బౌన్సర్ వేశాడు అంటే ఇక అది నోబాల్ గా అంపైర్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. కానీ ఇప్పుడు బిసిసిఐ మాత్రం కొత్త రూల్ తీసుకురాబోతుంది. ఏకంగా షార్ట్ బాల్ పేరుతో బౌలర్ ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు వేసేందుకు అవకాశం కల్పిస్తుంది అని చెప్పాలి. అలాగే స్టంపింగ్ కోసం థర్డ్ ఎంపైర్ కు రిఫర్ చేసినప్పుడు ముందుగా క్యాచ్ ను చెక్ చేసేలా రూల్ కొనసాగించనున్నారు. ఇక అవుట్ నాట్ అవుట్ తో పాటు వైడు, నో బాల్ కూడా ఒక్కటి రెండు రివ్యూలు ఉంటాయి. అయితే ఇటీవల ఐసీసీ తీసుకొచ్చిన స్టాప్ క్లాక్ రూల్ ని మాత్రం ఐపీఎల్ లోఅమలు చేయకపోవడం గమనార్హం.