అయ్యబాబోయ్.. ఆయనకు ఒక్కరోజు కామెంట్రికి రూ. 25 లక్షలు?
ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్లో పాల్గొనబోయే పది టీమ్స్ కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా ఇప్పటికే ప్రాణాలికలను సిద్ధం చేసుకున్నాయ్. కొన్ని టీమ్స్ ఏకంగా కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. సాధారణంగా ఐపీఎల్ ప్రారంభమైంది అంటే చాలు ఎక్కడ లేని ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు అందుతూ ఉంటుంది. అయితే ఐపీఎల్లో ఇంత ఎంటర్టైన్మెంట్ అందడానికి కారణం.. కేవలం మైదానంలో బరిలోకి దిగి క్రికెట్ ను కొనసాగించే ఆటగాళ్లు మాత్రమే కాదు.. ఇక మ్యాచ్లను తమ గాత్రంతో మరింత ఉత్కంఠ భరితంగా మార్చే కామెంటేటర్లు కూడా అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఐపీఎల్ ఉచితంగా ప్రసారం చేయబోయే జియో సినిమా ఇక కామెంట్రీ బాక్స్ లో ఉండే వ్యాఖ్యాతల వివరాలను ప్రకటించింది అని చెప్పాలి.
అయితే క్రికెట్ మ్యాచ్లలో కొందరు మాజీ ఆటగాళ్ళ కామెంట్రీ లు ఎప్పుడు ప్రత్యేకమే. అలాంటి వారిలో భారత మాజీ కోచ్ రవి శాస్త్రి, సిద్దు, సేహ్వాగ్ లాంటి ఆటగాళ్ల కామెంట్రీ అంటే ఇక ప్రేక్షకులు తెగ ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా సిద్ధూ కామెంట్రీ బాక్స్ లో ఉన్నాడు అంటే చాలు ఇక ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పక్క అని చెప్పాలి. ఎందుకంటే తనదైన శైలిలో వేసే చలోక్తులు నవ్వులు పూయిస్తూ ఉంటాయి. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ కి కూడా కామెంట్రీ అందించబోతున్నాడు సిద్దు. ఇక ఇలా కామెంట్రీ అందించినందుకు గాను ఒక్క రోజుకి 25 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడట. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.