అలా చేస్తే.. ఎక్కువమంది రంజీల్లో ఆడతారు : గవాస్కర్

praveen
బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాకతో అటు.. డొమెస్టిక్ క్రికెట్ ప్రమాదంలో పడిపోతుందా? గత కొంతకాలం నుంచి ఇదే విషయంపై చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎంతోమంది ప్లేయర్లు అటు ఐపీఎల్ లో ఆడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. తప్ప డొమెస్టిక్ క్రికెట్ లో భాగం కావడానికి పెద్దగా ఆసక్తిని కనపరచడం లేదు. టీమిండియాలో ఛాన్స్ దక్కక దూరంగా ఉన్న సమయంలో ఇంట్లోనే ఉండిపోతున్నారు. కానీ దేశవాళి మ్యాచ్లో ఆడటానికి మాత్రం ముందుకు రావడం లేదు.

 ఇక మొన్నటి వరకు సెలక్టర్లు కూడా ఏకంగా ఐపీఎల్లో ప్లేయర్ల ఆట తీరును ప్రామాణికంగా తీసుకుని.. అటు భారత జాతీయ జట్టులోకి సెలక్ట్ చేస్తున్నారు అన్న విమర్శలు కూడా వచ్చాయి. దీంతో చాలామంది ప్లేయర్లు దేశవాళి క్రికెట్ ను పట్టించుకోవడమే మానేశారు. ఇలాంటి సమయంలో ఇక దేశవాళీ క్రికెట్ భవితవ్యాన్ని కాపాడమే లక్ష్యంగా బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది బీసీసీఐ. అటు టీమిండియా కు దూరంగా ఉన్న ప్రతి ఒక ఆటగాడు కూడా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అంటూ స్పష్టం చేసింది బీసీసీఐ. ఇక ఇలా దేశవాళి క్రికెట్ ఆడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్ లను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మిగతా ప్లేయర్లు ఎవరైనా ఇలా చేస్తే ఇలాంటి చర్యలు తప్పవు అంటూ హెచ్చరికలు జారీ చేసింది.

 ఇలా దేశవాళీ క్రికెట్ లో అందరూ ఆటగాళ్లను భాగం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాంజీ ప్లేయర్లకు ప్రస్తుతం ఇస్తున్న మ్యాచ్ ఫీజుల కంటే మూడు రేట్లు ఎక్కువగా ఇవ్వాలి అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేసాడు. ఇలా చేయడం వల్ల రంజీ మ్యాచ్ లు ఆడేందుకు ఎక్కువమంది ప్లేయర్లు ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా టెస్టులకు ఎక్కువగా అందుబాటులో ఉండే ప్లేయర్లకు.. మ్యాచ్ ఫీజును పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విషయం మంచి నిర్ణయం అంటూ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం రంజీ ప్లేయర్లకు మ్యాచ్ల అనుభవాన్ని బట్టి రోజుకి 40 నుంచి 60 వేల వరకు మ్యాచ్ ఫీజును చెల్లిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: