ఈ ఏడాది.. ఐపీఎల్ కు దూరమైన ఆటగాళ్లు వీరే?
ఇకపోతే ఇలా క్రికెట్ పండగగా పిలుచుకునే.. ఐపీఎల్ టోర్నీ ప్రారంభించడానికి సమయం ఆసన్నమైంది. మరో వారం రోజుల్లో ఇక ఈ లీగ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. మార్చి 22వ తేదీన మొదలు కాబోయే ఈ టోర్నీ కోసం క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక 2024 ఐపీఎల్ సీజన్లో టైటిల్ గెలవడమె లక్ష్యంగా అన్ని టీమ్స్ కూడా సిద్ధమయ్యాయి. పక్క ప్రణాళికలను సిద్ధం చేసుకుని ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాయి అని చెప్పాలి ఇలాంటి సమయంలో ఐపీఎల్ ప్రారంభానికి ముందే కొన్ని టీమ్స్ కి మాత్రం ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయ్. ఎందుకంటే జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు చివరికి ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యారు.
అయితే కొంతమంది ఆటగాళ్ళు గాయం బారిన పడి టోర్నీ మొత్తానికి దూరం కాగా.. ఇంకొంతమంది ఆటగాళ్ళు వ్యక్తిగత కారణాలతో ఇక టోర్నీకి దూరమయ్యారు అని చెప్పాలి. కాగా ఇలా దూరమైన ఆటగాళ్ళ లిస్ట్ చూసుకుంటే.. గుజరాత్ టైటాన్స్ జట్టుకి మహమ్మద్ షమీ దూరమయ్యాడు. ఇక లక్నో జట్టుకి మార్కువుడ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ప్రసిద్ కృష్ణ, కోల్కతా జట్టుకి జేసన్ రాయ్, గుస్ అట్కిన్సన్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి హ్యారి బ్రూక్, లుంగి ఎంగేడి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు డేవన్ కాన్వే ఇక ఈ ఐపీఎల్ సీజన్ కి దూరమయ్యారు అని చెప్పాలి.