బెంగళూరు జట్టుకి.. ఇంతకంటే మంచి అవకాశం వస్తుందా?

praveen
మహిళ క్రికెట్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలాంటి అంచనాలు లేకుండా ప్రారంభమైన ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవలే భారీ అంచనాల మధ్య రెండో సీజన్ ప్రారంభమైంది. ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ వస్తుంది అని చెప్పాలి.

 ఇలా అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైర్మెంట్ పంచుతూ వచ్చినా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. కాగా నేడు అందరూ ఎదురు చూస్తున్న ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. లీగ్ దశలో అద్భుతమైన ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే గత ఏడాది మొదటి సీజన్లోనే టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జోరు చూస్తే ఇక ఈసారి కూడా ఫైనల్ వరకు చేరుకోవడం ఖాయమని అభిమానులు అందరూ కూడా బలంగా నమ్మారు. కానీ సెమి ఫైనల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది ముంబై ఇండియన్స్.

 అయితే మొదటి సీజన్లో అటు ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయి కేవలం రన్నరప్ గా మాత్రమే సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఇక మరోసారి ఫైనల్ కు చేరి టైటిల్ విజేత గా నిలవడానికి సిద్ధమైంది. ఇక మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తొలిసారి ఫైనల్ అడుగుపెట్టింది అని చెప్పాలి. బలాబలాల విషయంలో రెండు జట్లు కూడా సమతూకంతో ఉండడంతో ఇక తుది పోరు ఎంత ఉత్కంఠ సాగే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అటు పురుష, మహిళల లిగుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్లో ఆర్సిబి జట్టు టైటిల్ విజేతగా నిలిచి ఇక చరిత్ర సృష్టించాలని అటు అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl

సంబంధిత వార్తలు: