ముంబై కెప్టెన్సీ మార్పుఫై.. యువరాజ్ కీలక వ్యాఖ్యలు?

praveen
మార్చి 22వ తేదీ నుంచి ఇండియాలో క్రికెట్ పండుగ మొదలు కాబోతుంది. అదేనండి అందరు ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్ ఎప్పటిలాగానే అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. కానీ భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా భారీగానే నమ్మకం పెట్టుకున్నారు. ఇక మరోవైపు ఎప్పటిలాగానే తమకు మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువస్తుందని ఆటగాళ్లు కూడా ఫిక్స్ అయిపోయారు.

 ఇంకోవైపు అన్ని జట్ల యాజమాన్యాలు కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుని బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. అయితే ఐపీఎల్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్.. ఇక ఎన్నో ఏళ్ల తర్వాత కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగిపోతుంది. ఏకంగా ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను ఆ జట్టు యాజమాన్యం సారధ్య బాధ్యతల నుంచి తప్పించింది. కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించింది. దీంతో ముంబై చాలా ఏళ్ల తర్వాత ఇక కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగబోతుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే అటు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం కెప్టెన్ గా  తొలగించడం పై ఇప్పటికీ కూడా చర్చ జరుగుతుంది అని చెప్పాలి ఇక ఇదే విషయంపై అటు టీమిండియా. మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ చైర్మన్ కొనసాగించి ఉంటే బాగుండేది అంటే అభిప్రాయపడ్డాడు. రోహిత్ ఇప్పుడు టీమిండియా కు కెప్టెన్ గా ఉన్నాడు. ప్లేయర్ గాను బాగా రాణిస్తున్నాడు. ఇలాంటి అప్పుడు అతడిని ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కొనసాగిస్తే బాగుండేది హార్దిక్ ను వైస్ కెప్టెన్ గాని హేమిస్తే సరిపోయేది కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించడం అనేది పెద్ద నిర్ణయం అంటూ యువరాజ్ సింగ్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: