ఐపీఎల్ వల్లే.. ఇంగ్లాండ్ - ఇండియా ప్లేయర్ల మధ్య స్లెడ్జింగ్ : గావస్కర్

praveen
సాదరణంగా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు మధ్య స్లెడ్జింగ్ జరగడం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. అయితే కొన్ని టీమ్స్ తలబడినప్పుడు తరచూ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటిలో అటు ఇండియా, ఆస్ట్రేలియా జట్లు కూడా ఉన్నాయి అని చెప్పాలి. ఈ రెండు జట్లు మధ్య ఎప్పుడు ఏ ఫార్మాట్లో మ్యాచ్ జరిగిన ఇక ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాత్రం స్లెడ్జింగ్ తారాస్థాయిలో జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే వీరి మధ్య జరిగే గొడవలు ఎప్పుడు వార్తలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. అయితే కేవలం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మాత్రమే కాదు ఇండియా, ఇంగ్లాండ్ మధ్య కూడా అప్పుడప్పుడు ఇలాంటి స్లెడ్జింగ్ చూస్తూ ఉంటాం. అయితే ఇటీవల ఇండియా వేదికగా జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్, ఇండియా ఆటగాళ్ల మధ్య ఇలాంటి కవ్వింపులు జరిగాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇరు జట్ల ఆటగాళ్లు స్లెడ్జింగ్ తో రెచ్చిపోయారు. అయితే ఇలా ఇంగ్లాండ్, ఇండియా ప్లేయర్ల మధ్య తారాస్థాయిలో స్లెడ్జింగ్ జరగడానికి గల కారణం ఏంటి అన్న విషయంపై ఇటీవలే భారత మాజీ ఆటగాడు సునీల్ గావాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఐపీఎల్ కారణంగానే అటు ఇండియా, ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ జరుగుతుంది.  ఐపీఎల్ వేలంలో భారత ఆటగాళ్లు భారీ స్థాయి ధర దక్కించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇదే స్లెడ్జింగ్ కు కారణం అంటూ గవాస్కర్ చెబుతున్నాడు.  ఐపీఎల్ వేలంలో భారత ఆటగాళ్లు దక్కించుకున్న మొత్తాన్ని చూసి ఇంగ్లాండు ప్లేయర్లు ఓర్వలేక పోతున్నారు. అందుకే ఇండియాతో జరిగిన ప్రతి మ్యాచ్ లో కూడా ఇంగ్లాండ్ ప్లేయర్లు నోటికి పని చెప్పడం చేస్తూ ఉన్నారు అంటూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ పై ఇండియా సాధించే విజయం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు గవాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: