అదే జరిగితే.. ఐపీఎల్ ఆ ప్లేయర్లకు రూ.100 కోట్ల ధర?

praveen
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించిన హడావిడియే కనిపిస్తుంది  ఇప్పటికే బీసీసీఐ ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేసింది అన్న విషయం తెలిసిందే. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది  దీంతో ఇక ఈ క్రికెట్ పండుగను ఎంజాయ్ చేసేందుకు అటు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోతున్నారు. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి అన్ని జట్లు  ఇప్పటికే ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు అస్త్ర శస్త్రాలను కూడా సిద్ధం చేసుకున్నాయ్ విషయం తెలిసిందే.

 అయితే గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఇక పోటీపడి మరీ జట్టులోకి తీసుకున్న ఆటగాళ్లను ఇక ఇప్పుడు జట్టుకు విజయాల కోసం ఉపయోగించుకునేందుకు ఆయా జట్ల యాజమాలు సిద్ధమైపోయాయి. అయితే ఐపీఎల్లో ఆటగాళ్ల ధర విషయంలో ఉన్న హద్దులు రోజురోజుకు చెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే  ఇంతకుమించి ఇక మరో ఆటగాడు ధర పలకడు అనుకున్న ప్రతిసారి కూడా అందరి అంచనాలు తారుమారు అవుతూ ఉన్నాయి  ఎందుకంటే వేలం జరిగిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటగాడు రికార్డు స్థాయి ధర పలుకుతూనే ఉన్నాడు. గత ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో అటు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇద్దరు కూడా ఏకంగా ఐపీఎల్ హిస్టరీ లోనే భారీ ధర పరికారు అన్న విషయం తెలిసిందే.

 అయితే అటు విదేశీ ప్లేయర్లు ఇలా భారీ ధర పలుకుతుంటే అటు భారత స్టార్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్, సూర్యకుమార్ లాంటి ప్లేయర్లు మాత్రం తక్కువ ధరికే జట్లు ఆయా ప్లేయర్లను అంటిపెట్టుకున్నాయ్. ఇదే విషయంపై అటు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ రాబిన్ ఉత్తప్ప మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  ఐపీఎల్ లో శాలరీ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకపోయి ఉంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, బుమ్రా లాంటి ఆటగాళ్లు ఏకంగా 100 కోట్ల ధర పలికే వారు అంటూ రాబిన్ ఉత్తప్ప చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఈ క్రికెటర్లకు ఆ రేంజ్ లో క్రేజ్ ఉందని కేవలం ఐపిఎల్ లో సాలరీ విషయంలో ఉన్న నిబంధనల కారణంగానే ఈ ఆటగాళ్లకు తక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది అంటూ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: