147 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించాడు?

praveen
సాధారణంగా క్రికెట్లో ఫాస్ట్ బౌలర్ల కెరియర్ కాలం చాలా తక్కువగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు. స్పిన్నర్లు బ్యాట్స్మెన్ లతో పోల్చి చూస్తే ఇలా ఫాస్ట్ బౌలర్లు ఇక అతి తక్కువ సమయంలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే అని నిరూపించాడు ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్. ఏకంగా రెండు దశాబ్దాల నుంచి కూడా ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో కూడా తన సత్తా ఏంటో నిరూపిస్తున్నాడు. యువ ఆటగాళ్లకు సైతం సాధ్యంకాని రీతిలో తన ఫాస్ట్ బౌలింగ్ తో ప్రేక్షకులందరికీ కూడా ఫిదా చేసేస్తూ ఉన్నాడు. 40 ఏళ్ళ వయసు దాటి పోతున్న ఇంకా అతని ఫిట్నెస్ తో ఎప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాడు ఈ ఆటగాడు.

 ఈ క్రమంలోనే ఇక ఎంతోమంది యువ బౌలర్లు సైతం ఇక టెస్ట్ ఫార్మాట్లో కొనసాగలేక ఇక ఈ సాంప్రదాయమైన క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు మాత్రమే పరిమితం అవుతుంటే.. అటు 40 ఏళ్ల వయస్సు దాటి పోతున్న కూడా జేమ్స్ అండర్సన్ తన ఆటను ఇంకా టెస్ట్ ఫార్మట్ లో కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక ఇటీవల అటు ఇంగ్లాండ్ టీమిండియా మధ్య జరిగిన టెస్టు సిరీస్ లో కూడా అతను జట్టులో కీలక పాత్ర వహించాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఏకంగా క్రికెట్ చరిత్రలో తనను మించిన ఆటగాడు మరొకరు లేరు అన్న విషయాన్ని నిరూపించాడు ఈ ఆటగాడు.

 సరికొత్త చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు తీసిన తొలి ఫేస్ బౌలర్గా నిలిచాడు జేమ్స్ అండర్సన్. 187 టెస్ట్ మ్యాచ్ లలో అండర్సన్ ఈ అరుదైన ఘనతను సాధించాడు అని చెప్పాలి. ఇటీవలే ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్, టీమిండియా జట్ల మధ్య జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ వికెట్ తీయడం ద్వారా ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు ఈ సీనియర్ బౌలర్. కాగా ఈ లిస్టులో శ్రీలంక దిగ్గజ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు, ఆస్ట్రేలియా దిగ్గజ షైన్ వార్ను 708 వికెట్లతో తొలి రెండు స్థానాలలో ఉన్నారు. అయితే ఈ ఇద్దరు స్పిన్నర్లు కావడం గమనార్హం. ఫాస్ట్ బౌలర్లు ఎవరు కూడా ఇప్పటివరకు 700 వికెట్లు సాధించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: