ఇది కో ఇన్సిడెన్స్ కాదు.. అరుదైన రికార్డ్?

praveen
సాధారణంగా సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో ఇక అరుదైన రికార్డులు సృష్టించడం అనేది ఎంత కష్టమైన విషయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఎందుకంటే పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో అయితే అంతంతా మాత్రం ఫిట్నెస్ తో కూడా మ్యాచ్లు ఆడెందుకు అవకాశం ఉంటుంది. కానీ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం ఆటగాడు పూర్తిస్థాయి ఫిట్నెస్ తో ఉన్నప్పుడు మాత్రమే ఇక ఆటను కొనసాగించగలడు  ఎందుకంటే సుదీర్ఘ సమయం పాటు జరిగే ఈ ఆటలో ఆటగాడికి ఫిట్నెస్ కి అతని ఓపికకి సవాలు పెడుతూ ఉంటుంది టెస్ట్ క్రికెట్.

 అందుకే ఎంతోమంది దిగ్గజ చాలా కెరియర్ చూసుకున్న టెస్ట్ ఫార్మాట్ లో అతి తక్కువ మ్యాచ్ ఆడటం మాత్రమే చూస్తూ ఉంటాం  అలాంటిది ఏకంగా సాంప్రదాయమైన క్రికెట్ అయిన టెస్ట్ ఫార్మాట్లో 100 మ్యాచ్లను పూర్తి చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. కేవలం కొంతమంది లెజెండరీ క్రికెటర్స్ కి మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే నేటి జనరేషన్ క్రికెట్లో ఫ్యాబ్ 4గా పిలుచుకునే నలుగురు ఆటగాళ్లలో ఇప్పటికే ముగ్గురు టెస్ట్ ఫార్మాట్లో 100వ టెస్ట్ మైలురాయిని అందుకున్నారు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, జో రూట్, స్మిత్ లు ఇప్పటివరకు100 టెస్టులు మైలురాయిని  అందుకున్నారు. అయితే ఫ్యాబ్ 4 లో ఒకడైన కేన్ విలియమ్సన్  కూడా ఇక ఇప్పుడు 100 టెస్ట్ మార్క్ అందుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఒక అంపైర్ అరుదైన రికార్డు సృష్టించబోతున్నాడు అని చెప్పాలి.

 టెస్ట్ క్రికెట్లో అంపైర్ నితిన్ మీనన్ ఒక అరుదైన రికార్డును సాధించబోతున్నాడు. నేటి జనరేషన్ క్రికెట్లో ఫ్యాబ్ 4 గా పిలవబడే కోహ్లీ, జోరూట్, స్మిత్ విలియమ్సన్ 100వ టెస్టు అంపైర్   గా వ్యవహరించిన వ్యక్తిగా రికార్డు  అందుకోబోతున్నారు. ఇప్పటికే కోహ్లీ, రూట్, స్మిత్ టెస్ట్ మ్యాచ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ముగ్గురు క్రికెటర్లు 100 టెస్ట్ మ్యాచ్లకు కూడా అంపైర్ గా వ్యవహరించాడు నితిన్ మేనన్. అయితే ఆస్ట్రేలియా తో ప్రారంభం కాబోయే న్యూజిలాండ్ టెస్ట్ నేపథ్యంలో ఇక మరోసారి అంపైర్గా వ్యవహరించబోతున్నాడు నితిన్ మేనన్. ఇదే టెస్టులో అటు కెన్ విలియమ్సన్  100 టెస్టుల మార్కుని అందుకోబోతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: