ఐపీఎల్ వల్లే.. అది నేర్చుకోగలిగాను : ధోని
అయితే 2019లో అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోని అటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మాత్రం ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది కెప్టెన్గా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఏకంగా అటు ఐపీఎల్ టైటిల్ కూడా అందించాడు ధోని. అయితే ధోని లాంటి ప్లేయర్ కెప్టెన్ గా ఉన్న జట్టులో ఒక్కసారైనా భాగం కావాలని ప్రతి ఒక్క క్రికెటర్ కూడా అనుకుంటూ ఉంటాడు. ఇకపోతే ఇక ధోని ప్లేయర్లతో మైండ్ గేమ్ ఆడటంలో ఎప్పుడు ముందుంటాడు. అయితే ఇలా మైండ్ గేమ్ ఆడటం ఎక్కువగా నేర్చుకుంది ఐపీఎల్ ద్వారానే అంటూ చెప్పుకొచ్చాడు ధోని.
ఐపీఎల్ కారణంగానే విదేశీ ఆటగాళ్లను అర్థం చేసుకునే అవకాశం దక్కింది అంటూ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెప్పుకొచ్చాడు. అయితే విదేశీ ఆటగాళ్లతో నేను ఎక్కువగా మాట్లాడే వాడిని కాదు. కానీ ఐపీఎల్ టోర్నీ ద్వారా అది సాధ్యమైంది. ఈ టోర్నీతోనే విదేశీ ప్లేయర్లను అర్థం చేసుకున్నాను. అదే సమయంలో వారి బలాలు బలహీనతలతో పాటు సాంప్రదాయాలు కూడా తెలుసుకున్నాను. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించడం ఎంతో తేలికగా మారింది అంటూ మహేంద్ర సింగ్ ధోని చెప్పుకొచ్చాడు.