ఆస్ట్రేలియా గెలిచింది.. టీమిండియా నెంబర్.1 అయింది?

praveen
గత కొంతకాలం నుంచి భారత జట్టు టెస్ట్ ఫార్మాట్లో అద్వితీయమైన ప్రదర్శన కొనసాగిస్తూ అదరగొడుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్క చేయకుండా చిత్తుగా ఓడిస్తూ వరుసగా సిరీస్లను గెలుచుకుంటుంది. మొన్నటికి మొన్న ఏకంగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా అక్కడ ఏకంగా సౌత్ ఆఫ్రికా జట్టును సొంత గడ్డమీదనే ఓడించింది. అయితే ఇక ఇప్పుడు సొంత గడ్డ పైన కూడా  అదరగొడుతుంది. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో 5 మ్యాచ్ ల బెస్ట్ సిరీస్ ఆడుతుంది.

 ఇక ఈ అయిదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో కూడా అదరగొట్టేస్తుంది అన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయింది. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత జరిగిన మూడు టెస్టు మ్యాచ్ లలో వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చింది. దీంతో 3-1 తేడాతో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది టీం ఇండియా. ఇక ధర్మశాల వేదికగా జరగబోయే ఐదో టెస్ట్ మ్యాచ్లో కూడా విజయ డంకా  మోగించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది అని చెప్పాలి. అయితే ఇలా వరుస విజయాలు సాధిస్తూ అదరగొడుతున్న టీమిండియా.. ఇటీవలే డబ్ల్యూటీసి ర్యాంకింగ్స్ లో కూడా సత్తా చాటింది.

 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ లో భారత జట్టు మరోసారి నెంబర్వన్ ర్యాంకును సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇటీవలే జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టును ఆస్ట్రేలియా చిత్తుగా ఓడించడం భారత జట్టుకు కలిసి వచ్చింది. దీంతో ఇక మొన్నటి వరకు రెండవ స్థానంలో కొనసాగిన రోహిత్ సేన విన్నింగ్ పర్సంటేజ్ 64.5 8% తో టాప్ లోకి దూసుకువెళ్లింది. ఇక రెండు మూడు స్థానాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి అని చెప్పాలి. ఇక చివరి టెస్ట్ మ్యాచ్లో అటు భారత జట్టు గెలిచింది అంటే ఇక అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: