అంపైర్లకు కూడా డోపింగ్ టెస్ట్ చేయాలి.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్?

praveen
సాదరణంగా ప్రొఫెషనల్ క్రికెట్లో మ్యాచ్ లు వాడుతున్న ఆటగాళ్లకు డోపింగ్ టెస్టులు నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఆయా ఆటగాళ్లు నిషేధిత మాదకద్రవ్యాలు ఏమైనా ఉపయోగిస్తున్నారా లేదా అన్న విషయం ద్వారా నిర్ధారణ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఆటగాళ్లు ఇలా ఏకంగా రూల్స్ కి విరుద్ధంగా నిషేధిత డ్రగ్స్ వాడినట్లు తేలడంతో చివరికి వారిపై ఏకంగా బ్యాన్ విధించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు క్రికెట్ తో పాటు ఇతర ఆటల్లో కూడా ఇలా ఎంతోమంది ఆటగాళ్లు డోపింగ్  టెస్టులో ఫెయిల్ అయ్యి చివరికి నిషేధాన్ని ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే కేవలం ఆటగాళ్లకు మాత్రమే కాదు అటు ఎంపైర్లకు కూడా డోపింగ్ టెస్ట్ నిర్వహించాలి అంటూ ఇటీవల  ఒక భారత క్రికెటర్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు మనోజ్ తివారి. ఇటీవలే అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. తనకు మంచి ఛాన్సులు వచ్చి ఉంటే తాను కూడా  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాడిని అయ్యే వాడిని అంటూ ఇటీవలే ఒక అవార్డుల ఫంక్షన్ లో కూడా మనోజ్ తివారి చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయ్ అని చెప్పాలి. ఇక ఇప్పుడు మ్యాచ్లకు అంపైర్లుగా నిర్వహించే వారి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ క్రికెటర్.

 ఏకంగా అంపైర్లకు కూడా ఆటగాళ్లకు చేసినట్లుగానే అంపైర్లకు కూడా డొపింగ్  టెస్ట్ చేయాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆట మధ్యలో ఎంపైర్లు నిద్ర మత్తులో ఉండడం చాలాసార్లు చూశామూ. రాత్రి ఏం తాగారని నేను వాళ్ళను అడిగేవాడిని.. విస్కీ తాగాం అంటూ ఒక చిరునవ్వు చిందించే వారు అంపైర్లు. కానీ వారు ఇలా చేయడం వల్ల కంటి చూపు వినికిడి పై ప్రభావం చూపుతుంది. అది ఆటపై ప్రభావం చూపించి చివరికి ఎంతోమంది ఆటగాళ్లకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. అందుకే అంపైర్లకు కూడా డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తే ఇక క్రికెట్ ప్రమాణాలను మరింత మెరుగుపరిచినట్లు అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్ తివారి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: