4 నెలల చిన్నారి ప్రపంచ రికార్డు.. ఇంతకీ ఏం చేసిందంటే?

praveen
సాధారణంగా ప్రపంచ రికార్డు సృష్టించాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి వరల్డ్ రికార్డు సాధించడం కోసం ఏదేమైనా ఒక విషయంపై ఏళ్ల తరబడి సాధన చేసి ప్రపంచంలో ఎవరూ కూడా ఆ పనిని తమల చేయలేరు అన్న విషయాన్ని నిరూపిస్తూ ఉంటారు. ఇలా నిరూపించినప్పుడు మాత్రమే ఇక వరల్డ్ రికార్డులు చోటు సంపాదించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ రికార్డు సాధించాలి అనుకునేవారు ఇక ఎన్నో రకాల విన్యాసాలు చేయడం చూస్తూ ఉంటాం. ఇలాంటి విన్యాసాలలో కొన్ని కొన్ని సార్లు ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే విన్యాసాలు కూడా ఉంటాయి అని చెప్పాలి.

 ఇక ఇలాంటి తరహా ఘటనల గురించి అప్పుడప్పుడు వార్తల్లో వెలుగులోకి వస్తూ ఉంటాయి   ఇలాంటి విషయాల గురించి తెలిసి ప్రపంచ రికార్డు రావడం ఏమో కానీ ప్రాణాలు గాల్లో కలిసిపోయేలాగే ఉన్నాయి అని ఎంతోమంది ఇలాంటి విన్యాసాల పై కామెంట్లు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఇలా ప్రాణాలను పణంగా పెట్టి విన్యాసాలు చేయడం కాదు రోజూ చేసే పనులనే కాస్త డిఫరెంట్ గా చేసిన కూడా వరల్డ్ రికార్డులు సాధించవచ్చు అని నిరూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఇలాంటి ఒక రికార్డు క్రియేట్ అయింది  ఏకంగా నాలుగు నెలల చిన్నారి ప్రపంచ రికార్డును సృష్టించింది.

 నాలుగు నెలల వయస్సు ఉన్న చిన్నారి మనుషులను గుర్తుపట్టడమే కష్టం. ఇంకా వరల్డ్ రికార్డు ఎలా సృష్టిస్తుంది అనుకుంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఒక చిన్నారి ఇది చేసి చూపించింది. ఏపీలోని నందిగామ కు చెందిన నాలుగు నెలల చిన్నారి కైవల్య ప్రపంచ రికార్డు నెలకొల్పింది. నాలుగు నెలల వయసులోనే పక్షులు కూరగాయలు జంతువులతో కూడిన 120 రకాల ఫోటోలను గుర్తించింది. అయితే చిన్నారి తల్లి హేమ దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయిన వరల్డ్ గిన్నిస్ రికార్డు ప్రతినిధులు ఆమెకు సర్టిఫికెట్ అందించడంతోపాటు రికార్డు హోల్డర్ గా చిన్నారికి అరుదైన గౌరవం  ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: