ఎలా కొట్టాలో.. అలాగే కొట్టావ్.. సెహ్వాగ్ కామెంట్స్ వైరల్?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండు, టీం ఇండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చింది ఇంగ్లాండ్ జట్టూ. ఇక ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లు ముగియగా.. ప్రస్తుతం రాజ్కోట్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. నువ్వ నేను అన్నట్లుగా హోరాహోరీగా జరుగుతున్న ఈ పోరు.. క్రికెట్ ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అని చెప్పాలి. ఆటగాళ్లు కూడా సెంచరీల మీద సెంచరీలు చేస్తూ చెలరేగిపోతున్నారు. అయితే ఇక టెస్ట్ ఫార్మాట్ లో అనుభవమున్న సీనియర్ ప్లేయర్లు ఇలా సెంచరీలు చేయడం కొత్తేమీ కాదు. కానీ భారత జట్టులోకి మొన్నే ఎంట్రీ ఇచ్చిన యశస్వి జేష్వాల్ సీనియర్ బౌలర్లఫై సైతం విరుచుకుపడుతున్నాడు.

 సెంచరీలు, డబుల్ సెంచరీలు అంటూ చెలరేగిపోతూ భారత జట్టు విజయాలలో కీలక పాత్ర వహిస్తున్నాడు. ఇక అతనే భారత జట్టును నడిపించబోయే ఫ్యూచర్ స్టార్ అనే నమ్మకాన్ని అందరిలో కలిగిస్తూ ఉన్నాడు. మొన్నటికి మొన్న విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీ చేసి ఆకట్టుకున్న  జైష్వాల్ జట్టును విజయతీరాలకు నడిపించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు అటు ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో కూడా తన ఆట తీరుతూ ఆకట్టుకుంటున్నాడు. ఏకంగా సూపర్ సెంచరీ తో చెదరేగిపోయాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆడినట్లుగానే బ్యాట్ ఝాలిపించి బౌలర్లను వనికించాడు ఈ యువ ఆటగాడు.

 ఈ క్రమంలోనే అతను సాధించిన సెంచరీపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఇక అతని అద్భుత ఇన్నింగ్స్ పై టీమిండియా మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. జైష్వాల్ వరుస సెంచరీలు బాదాడు. స్పిన్నర్లను ఎలా కొట్టాలో అలాగే కొట్టావు అంటూ ఇక యశస్వి జైష్వాల్ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్ పెట్టాడు వీరేంద్ర సెహ్వాగ్. అయితే టీమిండియా కు మరో వీరేంద్ర సెహ్వాగ్ దొరికాడని యశస్వి జైష్వాల్ బ్యాటింగ్ చూస్తుంటే ఇది స్పష్టంగా అర్థమవుతుందని ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే 104 పరుగులు చేసిన తర్వాత రిటైర్డ్ హర్ట్ గా యశస్వి జైస్వాల్ మైదానాన్ని వీడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: