సినిమాలో నటిస్తున్న దివ్వెల మాధురి..ఏ సినిమా అంటే..?

Divya
రెండు తెలుగు రాష్ట్రాలలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పని లేదు. నిరంతరం వీరి ప్రేమ, కుటుంబ వ్యవహారాలు ,సోషల్ మీడియాలో రిల్స్ వల్ల ఎప్పుడు వైరల్ గా మారుతుంటారు. నిరంతరం ఏదో ఒక వివాదాలలో వార్తలలో నిలుస్తున్న మాదిరి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్లోకి నెగటివ్ తో లోపలికి వెళ్లిన బయటికి వచ్చేటప్పుడు మాత్రం కొంతమేరకు పాజిటివ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తాజాగా వెండితెర పైన కనిపించడానికి సిద్ధమయ్యింది మాధురి.



మాధురి నటిగా పరిచయమవుతున్న సినిమా టైటిల్ "చీన్ టపాక్ డుం డుం" అనే టైటిల్ ఖరారు చేశారు. సోషల్ మీడియాలో ఈ టైటిల్ కూడా వైరల్ గా మారింది. ఈ చిత్రంలో దివ్వెల మాదిరి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఆ పాత్ర గైరమ్మత్త. చాలా గంభీరమైన పాత్రగా ఉండబోతున్నట్లు సమాచారం ఇటీవల విడుదలైన పోస్టర్లో కూడా మాధురి చూస్తూ ఉంటే ఆమె పాత్ర సినిమాకి హైలెట్ గా ఉంటుందని కనిపిస్తోంది. ఈ సినిమాలో హీరోగా గవిరెడ్డి శ్రీనివాస్ నటిస్తూ ఉండగా, బ్రిగిడా సాగ హీరోయిన్గా నటిస్తోంది. డైరెక్టర్ వై ఎన్ లోహిత్ దర్శకత్వంలో రాబోతోంది.


ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. నిజానికి దివ్వెల మాదిరి ఒక క్లాసికల్ డాన్సర్ రాజకీయాల పైన మక్కువ ఉండటంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పొలిటికల్ పరంగా యాక్టివ్ గా ఉండేది. అనంతరం దువ్వాడ శ్రీనివాస్ కు దగ్గరవ్వడంతో వీరిద్దరూ కలిసి హైదరాబాదులో వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో బుల్లితెర పైన కూడా కనిపించింది. ఇప్పుడు తన అదృష్టాన్ని సిల్వర్ స్క్రీన్ పైన పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యింది. ప్రస్తుత ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది. మరి దివ్వెల మాధురికి ఏవిధంగా ఈ సినిమా కలిసొస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: