హార్ట్ సింబల్ పుట్టుక వెనుక.. ఇంత పెద్ద స్టోరీ ఉందా?

praveen
ఇటీవల కాలంలో మొబైల్ లో ఎన్నో రకాల ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక మనిషిలోని ప్రతి భావోద్వేగాన్ని తెలిపేందుకు ఇక ఇలాంటి ఎమోజీలను ఉపయోగిస్తూ ఉంటారు అందరూ. ఇక ఇలాంటి ఎమోజీల ద్వారా ఇక ఇతరులకు తమ అభిప్రాయాలను భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎవరి మీద అయినా ఉన్న ప్రేమను వ్యక్త పరచాలి అంటే ప్రతి ఒక్కరు ఉపయోగించే ఇమేజ్ లవ్ సింబల్.. ప్రేమను వ్యక్తపరచడానికి లేదా ప్రపోజ్ చేయడానికి ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెలపడానికి ఇలా లవ్ సింబల్ ని ఉపయోగిస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే.

 ప్రేమకు చిహ్నం ఏది అంటే ప్రతి ఒక్కరూ హర్ట్ సింబల్ పేరు చెబుతూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి హర్ట్ సింబల్ ని వాడేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అంతా బాగానే ఉంది కానీ అసలు ఈ హర్ట్ సింబల్ ఎలా వచ్చింది? ఈ సింబల్ ప్రేమకు చిహ్నంగా ఎలా మారిపోయింది అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. పెద్దగా ఎవరు ఈ విషయం గురించి కూడా పట్టించుకోరు. అయితే ఇలా ప్రేమకు గుర్తుగా లవ్ సింబల్ రావడానికి వెనక ఒక పెద్ద స్టోరీ నే ఉందట. ఇక ఈ స్టోరీ గురించి తెలిసి ప్రస్తుతం నేటిజన్స్ అందరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఏకంగా 1250 సంవత్సరంలో ఒక రచయిత రాసిన కావ్యం లో తొలిసారి ఈ హర్ట్ సింబల్ ని వాడారట. అప్పటినుంచి ఈ సింబల్ ప్రేమకు గుర్తుగా ఇక వాడకంలోకి వచ్చింది అన్నది తెలుస్తోంది.

 తైబు అనే రచయిత 1250 సంవత్సరంలో రాసిన రోమన్ డే లా పోయిరే అనే ప్రేమ కావ్యం లో తొలిసారి ఈ చిహ్నాన్ని వాడాడట. ఇక ఓ యువకుడు ప్రేమను తెలుపుతూ యువతికి తన గుండె అందిస్తున్నట్లు గల ఫోటోలో హృదయాన్ని గీసాడటా సదరు రచయిత. ఇక ఈ గుర్తు క్రమక్రమంగా కొన్ని మార్పులతో ఇక విశ్వ వ్యాప్తంగా కూడా ఈ చిహ్నం వాడుకలోకి వచ్చేసింది అని చెప్పాలి. అయితే అంతకుముందు హార్ట్ సింబల్స్ ఇలాగే ఉన్నప్పటికీ అప్పుడు అందరూ కూడా తలకిందులుగా గీసేవారు అని చెప్పాలి. ఇలా మనం రెగ్యులర్ గా యూస్ చేసే హార్ట్ సింబల్ వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: