మైండ్ బ్లాక్ అయ్యింది.. ఏం బౌలింగ్ భయ్యా ఇది?

praveen
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతోమంది దిగ్గజ బౌలర్లు ఉన్నారు. ఇలా ఎంతమంది దిగ్గజాలు ఉన్నప్పటికీ షేన్ వార్న్ మాత్రం ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. ఆయన కెరీర్ లో ఎన్నో రకాల వైవిధ్యమైన బంతులు సందించారు. కానీ ఎన్నో బంతులు వేసినప్పటికీ ఒక బంతి మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. ఆయన ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన వేసిన ఒక బంతి మాత్రం ఇప్పటికీ ప్రపంచ క్రికెట్లో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది. 1993 లో యాషేష్ సిరీస్ లో భాగంగా ఓల్డ్ ట్రాఫిగ్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో మైక్ గార్టింగ్ ను అవుట్ చేసిన బంతిని బాల్ ఆఫ్ ది సెంచరీగా పేర్కొంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే షైన్ వార్న్ లాగానే బంతిని స్పిన్ చేయాలని ఎంతోమంది స్పిన్నర్లు ఆశపడుతూ ఉంటారు. కానీ చాలామందికి కుదరదు. కానీ కొంతమంది యంగ్ బౌలర్లు మాత్రం ఇది సాధిస్తూ ఉంటారు. అయితే ఎవరైనా ఆటగాడు ఇలా షేర్ ను వార్న్ తరహాలో బాల్ అఫ్ సెంచరీ లాంటి బంతి వేశారు అంటే చాలు అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. అందరూ కూడా అదే విషయం గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తాజాగా ఒక యంగ్ లెగ్ స్పిన్నర్ అలాంటి బంతిని విసిరాడు

 కెసిసి టి20 ఛాలెంజర్స్ కప్ 2024 లో ఇది చోటు చేసుకుంది. కువైట్ నేషనల్ ఎస్సీ, ఎస్సీసీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మహమ్మద్ వకర్ అంజుమ్ కువైట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే అతను ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఒక అద్భుతమైన బంతితో బియాంత్ సింగ్ అనే బ్యాటర్ ను అవుట్ చేశాడు. ఆఫ్ స్టంప్ కు చాలా దూరంలో పిచ్ అయినా బంతి స్పిన్ తిరుగుతూ లెగ్ వికెట్ను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. వామ్మో ఈ టర్న్ ఏంటి గురు..  ఇలాంటి స్పిన్ బౌలింగ్ ఎప్పుడు చూడలేదు అంటూ ఎంతోమంది ఇందుకు సంబంధించిన వీడియో చూశాక  కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir

సంబంధిత వార్తలు: