వారెవ్వా.. టీమిండియాకు మరో సచిన్ దొరికేశాడుగా?

praveen
అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగింది టీం ఇండియా. ఈ క్రమంలోనే టైటిల్ ఫేవరెట్ గా ప్రస్తానాన్ని మొదలుపెట్టింది. ఇక అందరూ ఊహించినట్లుగానే అద్భుతంగా రానిస్తూ దూసుకుపోతుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్క చేయకుండా భారీ విజయాలను సాధిస్తుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడిన టీమిండియా ఆరింటిలో కూడా విజయం సాధించి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. అయితే ఇటీవల సెమి ఫైనల్లో భాగంగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో మాత్రం అతి కష్టం మీద విజయం సాధించి ఫైనల్ అడుగు పెట్టింది అని చెప్పాలి. ఎందుకంటే దక్షిణాఫ్రికా బౌలింగ్ ఫీల్డింగ్  తో దుమ్ము దులిపేసింది.

 దీంతో భారత జట్టు 32 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలోనే ఒక యువ కెరటం కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించాడు. తన అద్భుతమైన ఆట తీరుతో భారత జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. కెప్టెన్ ఉదయ్ తో కలిసి భారీ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. అతను ఎవరో కాదు సచిన్ దాస్. అతని కెరియర్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు ఈ కుర్రాడు. కేవలం రెండే రెండు పరుగుల తేడాతో ఇక అతను సెంచరీ మిస్ చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే అతని ఇన్నింగ్స్ పై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా టీమ్ ఇండియాకు కొత్త సచిన్ దొరికేశాడు అంటూ భారత క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

 ఒకప్పుడు సచిన్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా అయితే టీమిండియాను ఆదుకునే వాడో.. ఇక ఇప్పుడు ఆ క్రికెట్ దేవుడి పేరు పెట్టుకున్న సచిన్ దాస్ కూడా ఇలాగే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఇక అతను టీమ్ ఇండియాను నడిపించబోయే ఫ్యూచర్ స్టార్ అంటూ ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇకపోతే సౌత్ ఆఫ్రికా పై విజయం సాధించి ఫైనల్ అడుగు పెట్టిన టీమ్ ఇండియా.. అత్యధికంగా తొమ్మిది సార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా నిలిచింది. అంతేకాదు ఇప్పటివరకు అండర్ 19 వరల్డ్ కప్ లో 5 సార్లు వరల్డ్ కప్ ట్రోఫీ విజేతగా కూడా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: