మునుపెన్నడూ లేని ఆనందం.. సౌత్ ఆఫ్రికాకు ఆ విజయంతో దక్కింది?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న టీమ్స్ సైతం కొన్ని కొన్ని సార్లు ఇక కొన్ని టీమ్స్ పై గెలవలేక ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఎప్పుడు చెత్త రికార్డులు మూటగట్టుకుంటూ ఉంటాయని చెప్పాలి. ఇక ఒకే టీంపై పేలవ ప్రస్థానం కొనసాగించడం.. కూడా ఎప్పుడు చూస్తూ ఉంటాం. అలాంటి జట్టుపై విజయం సాధిస్తే ఇక ఆనందం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా మహిళల జట్టుకు కూడా ఇలాంటి ఒక ఆనందకరమైన క్షణమే దక్కింది అన్నది తెలుస్తోంది.

 ఒకవైపు ఆస్ట్రేలియా మరోవైపు సౌతాఫ్రికా రెండు టీమ్స్ కూడా వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్లుగానే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ రెండు జట్లు ప్రత్యర్థులపై ఎప్పుడు అధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటాయి అని చెప్పాలి. కానీ ఎందుకో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగితే మాత్రం అటు ఆస్ట్రేలియాదే పైచేయి అన్న విధంగా ప్రస్థానం కొనసాగుతూ వస్తుంది. ఇప్పటివరకు 16 వన్డే మ్యాచ్లలో ఒక్కసారి కూడా ఆస్ట్రేలియాపై విజయం సాధించలేకపోయింది సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు. కానీ మొదటిసారి ఆస్ట్రేలియాను మట్టికరిపించి చరిత్ర సృష్టించింది అని చెప్పాలి.

 ఇప్పుడు వరకు తలబడిన 16 వన్డే మ్యాచ్ లలో కూడా ఓడిపోయిన ప్రోటీస్ జట్టు తొలిసారి ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. అది కూడా ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డ మీదే ఓడించడం గమనార్హం. సిడ్ని  వేదికగా ఇటీవల జరిగిన రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు. ఏకంగా 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ మారి జానే కాప్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటింది. బ్యాటింగ్లో 75 పరుగులు చేయడమే కాదు బౌలింగ్లో కూడా మూడు వికెట్లు తీసి సత్తా చాటింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: