తప్పించుకుని పారిపోయిన ధోని.. వైరల్ వీడియో?

praveen
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు వీడ్కోలు పలికి దాదాపు 5 ఏళ్ళు కావొస్తుంది. అయినప్పటికీ ఇక ధోని క్రేజ్ మాత్రం కాస్తయినా తగ్గలేదు. ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారితో పోల్చి చూస్తే  సోషల్ మీడియాలో ధోనీకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఎక్కడైనా కనిపించాడు అంటే చాలు ఒక సెల్ఫీ అయినా తీసుకోవాలని అభిమానులు తెగ ఆరాటపడుతూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. అటు ధోని కూడా అభిమానులను ఎంతగానో గౌరవిస్తూ ఉంటాడు.

 ఈ క్రమంలోనే అభిమానులు ఎప్పుడైనా సెల్ఫీ అడిగినప్పుడు ఎంతో ఓపికగా వారు అడిగింది ఇచ్చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే గతంలో ధోని అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగినప్పుడు ఇక ఎంతోమంది ఫ్యాన్స్ ధోనీని కలవడానికి ఏకంగా సెక్యూరిటీని దాటుకొని మైదానంలోకి దూసుకువెళ్లడం చూసాము  అయితే ఇలా మైదానంలో తనను కలవడానికి వచ్చిన అభిమానులతో సరదాగా ప్రవర్తిస్తూ ఉంటాడు ధోని. ఏకంగా అభిమానులకు దొరకకుండా పరిగెత్తడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు మరోసారి ధోని ఇలాంటిదే చేశాడు.

 భారీ సంఖ్యలో అభిమానులు చుట్టు ముట్టడంతో వారి నుంచి తప్పించుకుని పారి పోయాడు మహేంద్ర సింగ్ ధోని. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయింది. ప్రస్తుతం ఫ్యామిలీ తో ధోని వేకేషన్ లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ అక్కడ ధోనిని చూసిన ఫ్యాన్స్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. ఇక వారిని కంట్రోల్ చేయడం బౌన్సర్ల వల్ల కూడా కాలేదు  దీంతో ధోని అక్కడి నుంచి పరుగెత్తాడు  అయినప్పటికీ ధోని అభిమానులు మాత్రం వదలలేదు. ఇక ఈ వీడియో చూసి ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: