అయ్యబాబోయ్.. వన్డే మ్యాచ్ ను 6.5 ఓవర్లలో ముగించారు?

praveen
సాధారణంగా టి20 ఫార్మాట్ అంటే చాలు దనా ధన్ క్రికెట్ అని అభివర్ణిస్తూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. ఎందుకంటే 20 ఓవర్ లలో ఏకంగా 10 మంది బ్యాట్స్మెన్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది  దీంతో క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా ధనాధాన్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటాడు. క్రీజ్ లోకి రావడం రావడమే సిక్సర్లు పోర్లతో చెలరేగిపోతూ ఉంటాడు బ్యాట్స్మెన్. అందుకే ఈ ధనాధన్ ఇన్నింగ్స్ ని చూడటానికి అటు అభిమానులు అందరూ కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.

 అయితే ఇక టి20 ఫార్మాట్ తో పోల్చి చూస్తే వన్డే ఫార్మాట్ కాస్త సుదీర్ఘంగా సాగుతూ ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ ఫలితం తేలాలి అంటే దాదాపు ఒక్కరోజు సమయం పడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక 50 ఓవర్ల పాటు ఆటగాళ్లు ఎంతో నిలకడగా రాణిస్తూ వికెట్ను కాపాడుకుంటూనే పరుగులు చేయాల్సి ఉంటుంది. అందుకే టి20 ఫార్మాట్ తో పోల్చి చూస్తే వన్ డే ఫార్మాట్లో బ్యాటింగ్ మెరుపులు కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే సుదీర్ఘంగా 50 ఓవర్ల పాటు సాగాల్సిన వన్డే మ్యాచ్ కేవలం 7 ఓవర్లు కూడా జరగకపోతే.. అది కాస్త అటు వరల్డ్ క్రికెట్లో చర్చనీయాంశంగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇటీవల ఆస్ట్రేలియా వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇదే జరిగింది. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చి వరుసగా సిరీస్ లు ఆడుతుంది. ఈ క్రమంలోనే వన్డే సిరీస్ ప్రారంభించింది. ఇటీవల మూడో వన్డేలో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో వెస్టిండీస్ కి దారుణమైన పరాజయం ఎదురైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 24.1 ఓవర్లలో 86 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఆస్ట్రేలియా 6.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. జోష్ ఇంగ్లీస్ 35, జోక్ ప్రెజర్ మేగ్ గుర్క్ 41 పరుగులతో మెరుపులు మెరిపించారు. కాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా క్లీన్ స్లీప్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: