ఇషాన్ కిషన్ ను మేము బలవంతం చేయట్లేదు : ద్రావిడ్

praveen
టీమిండియాలో కొనసాగుతున్న కీలక ప్లేయర్లలో ఇషాన్ కిషన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అయితే గతకొంతకాలం నుంచి ఇషాన్ కిషన్ విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే అటు సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా ఆతిథ్య  సౌతాఫ్రికా జట్టుతో టెస్టు సిరీస్ కోసం ఇషాన్ కిషన్ నూ బీసీసీ సెలెక్టర్లు జట్టులో ఎంపిక చేశారు. అయితే సరిగ్గా టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా అతను జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. మానసిక అలసట కారణంగా అతను లీవ్ కావాలి అంటూ సెలెక్టర్లను కోరాడు.

 ఈ క్రమంలోనే అతని పరిస్థితిని అర్థం చేసుకున్న సెలెక్టర్లు.. చివరికి అతనికి సెలవులను మంజూరు చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి పలు టూర్లను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇషాన్ కిషన్. అయితే భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగే టి20 సిరీస్ లో ఇషాన్ కిషన్ కు చోటు దక్కుతుందని అందరూ అనుకున్నప్పటికీ.. అది జరగలేదు. దీంతో ఇక రంజీ ట్రోఫీలు ఆడి మళ్లీ టీమిండియాలోకి వస్తాడు అనుకున్న అలా కూడా చేయలేదు. చివరికి ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కి కూడా అతను అందుబాటులో ఉండడు అన్న విషయం తెలుస్తోంది.

 ఈ క్రమంలోనే అసలు ఇషాన్ కిషన్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అనే విషయంపై చర్చ జరుగుతుంది. అయితే ఇలా గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్తో పాటు  దేశవాళి క్రికెట్ నుంచి విరామం తీసుకున్న యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ రీ ఎంట్రీ పై కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. అతను విరామం కావాలని అడగడంతో మేము అంగీకరించాం. ఆట ఆడటం ఎప్పుడు ప్రారంభిస్తాడో అతడే నిర్ణయించుకోవాలి. కొంచెం క్రికెట్ ఆడిన తర్వాత జాతీయ జట్టుకు పరిగణలోకి తీసుకుంటాం  అయితే ఎప్పుడు ఆడాలి అనే విషయంపై మాత్రం మేము అతన్ని బలవంతం చేయట్లేదు అంటూ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: