రెండో టెస్టులో విజయం.. మూడో టెస్ట్ కు స్టార్ ప్లేయర్ దూరం?

praveen
గత కొంతకాలం నుంచి భారత జట్టును గాయాల బెడద తీవ్రంగా వేధిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. కీలకమైన టోర్నీలు ఆడుతున్న సమయంలో జట్టులో ప్రధాన ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు గాయాల పాడిన పడుతూ ఇక జట్టుకు దూరమవుతున్నారు. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీ సమయంలో కూడా ఇలాంటిదే జరిగింది  ఏకంగా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా అర్ధాంతరంగా గాయం బారినపడి వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నాడు. ఇక వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన వెంటనే మహమ్మద్ షమీ గాయంతో జట్టుకు దూరంగానే ఉంటున్నాడు.

 ఇక మానసిక అలసట ఉంది అని ఇషాన్ కిషన్ లీవ్ తీసుకున్నాడు. మరోవైపు రుతురాజ్  సైతం చేతి వేలికి గాయం కావడంతో చివరికి జట్టుకు అందుబాటులో ఉండడం లేదు. ఇలా ఎంతోమంది కీలక ప్లేయర్లు జట్టుకు దూరమైపోయారు అని చెప్పాలి. ఇక ఇటీవల ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా, కే ఎల్ రాహుల్ కూడా గాయం బారిన పట్టి జట్టుకు దూరమయ్యారు. అయినప్పటికీ పట్టు విడువని విక్రమార్కుడిలా భారత జట్టు పోరాడుతూనే ఉంది. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయాన్ని సాధించి సత్తా చాటింది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇక ఇప్పుడు మూడో టెస్ట్ మ్యాచ్ కు టీమ్ ఇండియాకు మరో బిగ్ షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఇండియా విజయాల్లో కీలక పాత్ర వహించిన బౌలర్ బుమ్రా మూడో టెస్ట్ కు దూరం కానున్నాడట  రాజ్కోట్ వేదికగా జరిగే మ్యాచ్ కి ఆయనకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. చివరి రెండు టెస్టులకు ఉత్సాహంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట బీసీసీఐ సెలెక్టర్లు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  అయితే చివరి మూడు టెస్టులకు బీసీసీఐ టీం వివరాలను నేడు ప్రకటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: