సెంచరీలలో.. కోహ్లీని దాటేసిన విలియమ్సన్?

praveen
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అగ్రశ్రేణి టీమ్స్ అన్నీ కూడా వరుసగా టెస్ట్ సిరీస్ లతో బిజీబిజీగా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ లలో ఇక ఆయా ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్న నేపథ్యంలో ఎన్నో రికార్డులు కూడా బద్దలవుతున్నాయి. కాగా ప్రస్తుతం అటు న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా మధ్య కూడా టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్ లో గాయం నుంచి కోలుకుని మళ్ళీ జట్టులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

 ఏకంగా తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించి సూపర్ సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఇక న్యూజిలాండ్ జట్టులోని మరో బ్యాట్స్మెన్ కూడా ఇలా సెంచరీ చేసి ఆకట్టుకోవడం గమనార్హం. అయితే ఈ సెంచరీ తో అరుదైన రికార్డును కొల్లగొట్టాడు కెన్ విలియమ్సన్. ఇప్పటికే వరల్డ్ క్రికెట్లో అద్భుత ప్లేయర్లలో ఒకడిగా కొనసాగుతూ.. తన ఆటతీరుతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన కేన్ విలియమ్సన్ ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ తో కదం తొక్కడంతో మరో అరుదైన రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్లో అతి తక్కువ సమయంలోనే 30 సెంచరీలు సాధించాడు. దీంతో అరుదైన  రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం బ్రాడ్మన్, టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీలను అధిగమించాడు కేన్ విలియమ్సన్. బ్రాడ్మన్ 52 టెస్టుల్లో 29 సెంచరీలు చేయగా.. అటు విరాట్ కోహ్లీ 113 టెస్ట్ మ్యాచ్ లలో 29 సెంచరీల రికార్డును అందుకున్నారు. అయితే ఇటీవల సెంచరీ చేయడం ద్వారా 30 సెంచరీలు మార్క్ అందుకొని వీరిద్దరిని దాటేశాడు కేన్ విలియమ్సన్. 97 టెస్టుల్లో ఇక విలియంసన్ ఈ రికార్డును అందుకోవడం గమనార్హం. అయితే అతడు గత తొమ్మిది టెస్ట్ ఇన్నింగ్స్ లోనే ఐదు సెంచరీలు నమోదు చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: