డబుల్ సెంచరీ చేశాడని.. జైశ్వాల్ ని హీరోని చేయకండి : గంభీర్

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా అత్యుత్తమ ప్రదర్శన చేసే ఆటగాళ్లను ఏకంగా దేవుళ్ళుగా ఆరాధిస్తూ ఉంటారు భారత క్రికెట్ ప్రేక్షకులు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా మంచి తరఫున ప్రదర్శన చేస్తున్న వారిని పొగడ్తలతో ఆకాశానికి ఏర్పేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజీ కొన్ని కొన్ని సార్లు ఏకంగా ఆటగాళ్లపై ఒత్తిడిని కూడా పెంచుతూ ఉంటుంది. ఎక్కడ అభిమానుల అంచనాలను అందుకోలేక పోతామో అని ఒత్తిడితో ఫామ్ కోల్పోతూ ఉంటారు ఎంతోమంది క్రికెటర్లు.

 ఇటీవల కాలంలో భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తున్న యువ ఆటగాళ్ళ విషయంలో ఇదే జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో టీమిండియాలో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు చోటు సంపాదించుకొని సత్తా చాటుతున్నారు. అయితే ఎవరైనా ఆటగాడు ఇలా జట్టులోకి వచ్చిన కొత్తలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు అంటే చాలు ఇక అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది అని చెప్పాలి. ఏకంగా అతను ఒక గొప్ప యోధుడు.. హీరో అంటూ అందరూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇటీవల విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ తో ఆకట్టుకున్న యశస్వి జైష్వాల్ పై కూడా ఇలాగే ప్రశంసలు కురుస్తున్నాయి.

 అయితే ఇదే విషయంపై స్పందించిన టీమ్ ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్  షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల యశస్వి జైస్వాల్ చేసిన డబుల్ సెంచరీకి మితిమీరిన ప్రచారం కల్పించవద్దు అంటూ గౌతమ్ గంభీర్ కోరాడు. ఇండియాలో అందరికీ ఓ లక్షణం ఉంది. ఒక మ్యాచ్ లో బాగా ఆడగానే ఆకాశానికి ఎత్తేస్తారు. బిరుదులు తగిలించి హీరోలను చేస్తారు. ఇలాంటి ప్రచారం ప్లేయర్లపై ఒత్తిడిని పెంచుతుంది. సహజ సిద్ధంగా ఆడలేరు. ప్రస్తుతం జైష్వాల్ కు 22 ఏళ్ళే. అతని విషయంలో సంయమనం పాటించాలి అంటూ గౌతమ్ గంభీర్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: