ధోని ఫ్యాన్స్ వల్ల.. ఎన్నోసార్లు ఏడ్చాను : రిషబ్ పంత్

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్లను దేవుళ్ళుగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయం తెర మీదికి వచ్చినా కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక ఇలా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టే కొంతమంది ప్లేయర్లకు ను ఏకంగా దిగ్గజ ప్లేయర్లతో పోల్చి చూడడం చేస్తూ ఉంటారు ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు. ఈ క్రమంలోనే టీమిండియా వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ అయినా రిషబ్ పంత్ ను ధోని వారసుడిగా అభివర్ణిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 మహేంద్ర సింగ్ ధోనీ లాగే వికెట్ కీపింగ్ చేస్తూ ఉండడం ఇక బ్యాటింగ్ లో కూడా మిడిల్ ఆర్డర్లో బరిలోకి దిగుతూ ఉండడంతో అతను ధోనీకి వారసుడు అంటూ అతని ఎంట్రీ నాటి నుంచి అందరూ పొగడటం మొదలుపెట్టారు. అయితే ఎవరికైనా ఇలాంటి ట్యాగ్ వచ్చింది అంటే చాలు ఇక వారిపై ఒత్తిడి కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా ఆటగాడు విఫలమైతే తీవ్ర స్థాయిలో ట్రోలింగ్  చేయడం కూడా చూస్తూ ఉంటాం. అయితే తనకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్. ఏకంగా ధోని అభిమానుల వల్ల ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నాను అంటూ తెలిపాడు.

 ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రిషబ్ పంత్ చేసిన కామెంట్లు కాస్త వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. మహేంద్ర సింగ్ ధోని అభిమానులు చూపే అత్యుత్సాహం కొన్ని కొన్ని సందర్భాల్లో తనను ఎంతగానో బాధపెట్టింది అంటూ స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. కెరియర్ ఆరంభంలో ధోని వారసుడిగా నన్ను చాలామంది ప్రశంసించేవారు. అయితే మ్యాచ్ లో ఎప్పుడైనా స్టంపింగ్ మిస్ చేసినప్పుడు.. ఇక ధోనితో పోల్చుతూ దారుణంగా ట్రోలింగ్ చేసేవారు. ఆ సమయంలో నేను చాలా బాధపడేవాడిని.. మ్యాచ్ పూర్తయ్యాక గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడిని.. ఐదు మ్యాచ్లు ఆడిన ఆటగాడిని 500 మ్యాచ్లు ఆడిన దిగ్గజంతో పోల్చడంలో అసలు అర్థమే లేదు అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: