అద్భుత ఇన్నింగ్స్ పై.. జైష్వాల్ ఏమన్నాడో తెలుసా?

praveen
యశస్వి జైస్వాల్.. గత కొంతకాల నుంచి భారత క్రికెట్ లో కాస్త గట్టిగా వినిపిస్తున్న పేరు. ఎందుకంటే అంత గట్టిగానే అతని బ్యాటింగ్ తీరు కూడా ఉంది. ఏకంగా సీనియర్ క్రికెటర్ల సైతం తడబడుతున్న పిచ్ లపై అతను పరుగుల వరద పారిస్తున్నాడు. దేశవాళి క్రికెట్ లో ఎలా అయితే బ్యాటింగ్ టెంపర్ చూపించాడో.. అదే టెంపర్మెంట్ ని అంతర్జాతీయ క్రికెట్లో కూడా కొనసాగిస్తున్నాడు. చాలామంది ప్లేయర్లు దేశవాళి క్రికెట్లో బాగా రాణించినప్పటికీ.. ఎందుకో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడేటప్పుడు మాత్రం ఒత్తిడికి లోనై సరైన ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు.

 కానీ యశస్వి జైస్వాల్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. తనకు దేశవాళి క్రికెట్ అయినా అంతర్జాతీయ క్రికెట్ అయినా ఒకటే. నా ఆటతీరులో ఎలాంటి మార్పు ఉండదు అన్న విషయాన్ని ప్రతి మ్యాచ్ లో కూడా నిరూపిస్తున్నాడు ఈ ప్లేయర్. ఇక ఫార్మాట్ తో సంబంధం లేకుండా అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. అతని దూకుడైన బ్యాటింగ్ కు ముందు ఇక సీనియర్ బౌలర్లు సైతం తేలిపోతున్నారు అనడంలో సందేహం లేదు. అయితే ఇటీవల ఇంగ్లాండుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.

 సీనియర్ ప్లేయర్లు తక్కువ పరుగులకే వికెట్ కోల్పోతున్న సమయంలో అతను మాత్రం ఏకంగా భారత ఇన్నింగ్స్ ని నిలబెట్టాడు. ఏకంగా 179 పరుగులు చేసి భారత జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో కీలక పాత్ర వహించాడు. ఈ క్రమంలోనే తన సుదీర్ఘ ఇన్నింగ్స్ గురించి జైష్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మలు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు అంటూ చెప్పుకొచ్చాడు. ఆఖరి వరకు నిలబడి భారీ ఇన్నింగ్స్ గా మార్చమని ప్రోత్సహించినట్లు తెలిపాడు. అయితే టీం కోసం చివరి వరకు ఆడతానని.. రేపటి కోసం మరింత సిద్ధమవ్వాలి అంటూ జైశ్వాల్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: