ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన.. టీమిండియా క్రికెటర్లు?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా క్రికెటర్లను దేవుళ్ళుగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే ఒక్కసారి ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు అంటే చాలు అతని లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతూ ఉంటుంది. ఏకంగా అప్పటివరకు ఆర్థిక సమస్యలతో బాధపడిన ఆటగాళ్లు సైతం లగ్జరీ లైఫ్ ను గడుపుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక భారత ఆటగాళ్ళు ఎక్కడైనా మ్యాచ్ ఆడేందుకు వెళ్ళినప్పుడు.. వారికి ఎంత లగ్జరీ తో కూడిన సదుపాయాలు అందుబాటులో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఏకంగా మ్యాచ్ జరిగే వేదికకు వెళ్లడానికి ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక వారికి ప్రత్యేకంగా కేటాయించిన బస్సుల్లోనే క్రికెటర్లు ఇక ప్రయాణించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే భారత పర్యటనకు వచ్చిన విదేశీ జట్లకు కూడా ఇలాంటి సదుపాయాలను బీసీసీఐ అందుబాటులో ఉంచుతూ ఉంటుంది. కానీ ఏకంగా సాధారణ ప్రయాణికులు లాగా స్టార్ క్రికెటర్లు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లడం ఎప్పుడైనా చూసారా అంటే వాళ్ళకి అంత కర్మ ఏం పట్టింది అంటారు ఎవరైనా. కానీ విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం ఒకవైపు ఇంగ్లాండ్ ప్లేయర్లు, మరోవైపు ఇండియా ప్లేయర్లు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

 వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ రెండు టెస్ట్ సందర్భంగా ఏకంగా గ్రౌండ్ నుంచి హోటల్కు  ఇండియా ఇంగ్లాండ్ క్రికెటర్లు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ విషయాన్ని ఇక ఏపీఎస్ఆర్టీసీ సంస్థ తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఇలా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినందుకుగాను బీసీసీఐకి, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్టుకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపింది ఏపీఎస్ఆర్టీసీ. ఏది ఏమైనా ఒక సాధారణ ఆర్టీసీ బస్సులో స్టార్ క్రికెటర్లు ప్రయాణించడం అంటే నిజంగా గొప్ప విషయమే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: