అద్భుత ఇన్నింగ్స్ తో.. జైష్వాల్ అరుదైన రికార్డ్?

praveen
నరుక్కుంటూ పోతే మీకు అలుపు వస్తదేమో నాకు మాత్రం ఊపు వస్తది అని బాలకృష్ణ చెప్పే పవర్ఫుల్ డైలాగులు ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్ అవుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అచ్చం ఇలాంటి ఆట తీరుతో ఇక ఇప్పుడు జైష్వాల్ కూడా క్రికెట్ ప్రేక్షకులకు అలాగే కనెక్ట్ అయిపోతూ ఉన్నాడు. పరుగులు చేస్తూ పోతుంటే మీకు అలుపు వస్తదేమో.. నాకు మాత్రం ఊపు వస్తది అన్న విధంగా అతని ప్రస్థానం టీమిండియాలో కొనసాగుతూ ఉంది. అప్పటికే దేశవాళి క్రికెట్ లో వీరబాదుడు బాది సెలెక్టర్ల చూపును ఆకర్షించాడు.

 బక్కపలుచుగా కనిపించే ఈ కుర్రాడు భారీ సిక్సర్లు కొడుతూ ఉంటే చూస్తున్న ప్రేక్షకులు సైతం ఆశ్చర్యంలో మునిగిపోయారు. అయితే ఇక ఇలా సెలెక్టర్ల చూపును ఆకర్షించి టీమ్ ఇండియాలోకి వచ్చాడు. టీమిండియాలోకి వచ్చిన తక్కువ సమయంలోనే తన బ్యాటింగ్ ఇంపాక్ట్ ఏంటి అన్న విషయాన్ని అందరికీ నిరూపిస్తూ ఉన్నాడు. అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్నాడు. సీనియర్లు విఫలమవుతున్న సమయంలో నేనున్నాను నాయనమ్మ అని ఇంద్ర సినిమాలో చిరంజీవి చెప్పినట్లు నేనున్నాను రోహిత్ భయ్యా అని టీమిండియాకు ఒక భరోసాని ఇస్తున్నాడు యశస్వి.


 ఇక ఇటీవల  తన బ్యాటింగ్ సామర్థ్యం ఏంటి అన్న విషయాన్ని మరోసారి నిరూపించాడు. ఇక విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో అందరూ విఫలమవుతున్న సమయంలో యశస్వి జైష్వాల్ మాత్రం 179 పరుగులతో వీరుచితమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఎన్నో రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ పై ఒక్క రోజులోనే ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్ మెన్  జాబితాలో చేరిపోయాడు. యశస్వి జైస్వాల్. 2016లో కరుణ్ నాయక్ 232 పరుగులు చేసి టాప్ లో ఉండగా.. రెండో స్థానంలో గవాస్కర్ 1979లో 179 పరుగులు చేసి ఉన్నాడు. ఇక ఇప్పుడు యశస్వి జైస్వాల్ గవాస్కర్ సరసన చేరిపోయాడు. ఇక తొలిరోజే అత్యధిక రన్స్ కొట్టిన జాబితాలోను ఆరో స్థానంలో నిలిచాడు జైస్వాల్. ఇక  ఈ లిస్టులో పాకిస్తాన్ పై 2004లో 228 పరుగులు చేసి టాప్ లో ఉన్నాడు సెహ్వాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: