రికార్డుపై కన్నేసిన అశ్విన్.. మరో 3 వికెట్లు సాధిస్తే చరిత్రే?

praveen
టీమిండియాలో సీనియర్ స్పిన్నర్ గా కొనసాగుతూ ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే ఇక అతనితోపాటు భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ఎంతోమంది సీనియర్ ప్లేయర్స్ యువ ఆటగాళ్ల రాకతో జట్టులో స్థానం కోల్పోయారు. ఇక మళ్ళీ ఫామ్ నిరూపించుకొని టీంలోకి రావాలి అనుకున్న అది కుదరడం లేదు. కానీ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఎప్పటికప్పుడు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. తన బౌలింగ్ తో ప్రత్యర్థులను భయపెడుతూ.. యువ ఆటగాళ్ల కంటే తన అనుభవమే గొప్ప అన్న విషయాన్ని ప్రతి మ్యాచ్లో కూడా నిరూపిస్తూ వస్తున్నాడు.

 అందుకే ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు ప్రస్తుతం జట్టులో చోటు కోల్పోయినప్పటికీ.. అటు బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం రవిచంద్రన్ అశ్విన్ కు తరచూ జట్టులో స్థానం కల్పిస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో అతని ఆట తీరు ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే టీమిండియా ఎప్పుడు టెస్టులు ఆడిన కూడా అతన్ని తప్పకుండా జట్టులోకి తీసుకుంటూ ఉంటుంది. కాగా ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ లో భారత జట్టులో భాగమయ్యాడు అశ్విన్. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. కాగా ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా నేటి నుంచి ప్రారంభం కాబోతుంది.

 అయితే ఈ టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ ఒక అరుదైన రికార్డుపై కన్నేశాడు అని చెప్పాలి. ఏకంగా ఈ మ్యాచ్ లో మరో నాలుగు వికెట్లు తీస్తే టెస్ట్ ఫార్మాట్లో 500 వికెట్లు తీసిన తొమ్మిదో మేల్ క్రికెటర్ గా నిలుస్తాడు అశ్విన్. మూడు వికెట్లు తీస్తే ఏకంగా ఇంగ్లాండ్ పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా చరిత్ర సృష్టిస్తాడు. కాగా తొలి టెస్ట్ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా ఆరు వికెట్లు సాధించి సత్తాచాటాడు అన్న విషయం తెలిసిందే. ఇక విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా అతను ఎంతో కీలకం కాబోతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: