అనుభవజ్ఞుడైన పూజార కంటే.. అతనికే ఎక్కువ ఛాన్సులు : కుంబ్లే

praveen
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ అడేందుకు అటు ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రావడం గమనార్హం. అయితే ఇక ఇటీవల ఈ రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన పోరులో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా భారత్ ను వారి సొంత గడ్డమీదే ఓడించింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో 28 పరుగుల తేడాతో భారత జట్టుకు పరాజయం తప్పలేదు.

 ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఆటతీరుతో ఇక మిగతా టెస్టుల్లో కూడా భారత జట్టు విజయం సాధించలేదు అంటూ ఎంతో మంది టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ఇక మొదటి మ్యాచ్ లో ఓడిపోయి నిరాశపరిచిన టీమ్ ఇండియా రెండో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం తప్పక విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలను రచిస్తుంది. కాగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం.

 అయితే రెండో టెస్ట్ మ్యాచ్లో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక గత కొంతకాలం నుంచి జట్టులో యువ ఆటగాడు గిల్ వరుసగా ఛాన్సులు దక్కించుకుంటున్నాడు. ఇక ఇదే విషయంపై ఇటీవల స్పందించిన భారత క్రికెట్ దిగజం అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత టెస్టు జట్టులో పూజారకు ఎప్పుడు దక్కని అవకాశాలు గిల్ కు దక్కుతున్నాయి అంటూ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. వంద టెస్టులకు పైగా ఆడిన పూజారకు దొరకని చాన్సులు గిల్ కు లభిస్తున్నాయి. కానీ వాటిని అతను సద్వినియోగం చేసుకోవాలి. మూడో స్థానంలో ఓపికగా ఆడాలి  మైండ్ సెట్ టెక్నిక్లను మార్చుకోవాలి. సరైన మార్గదర్శనం కోసం అద్భుతమైన ఆటగాడు భారత కోచ్గా ఉన్నాడు అంటూ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: