టీమిండియాకు బిగ్ షాక్.. విరాట్ కోహ్లీ జట్టులోకి డౌటేనట?

praveen
భారత జట్టు ఏ ఫార్మాట్లో మ్యాచ్ లు ఆడుతున్న అందులో భాగం అవుతూ ఉంటాడు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఇక ప్రతి ఫార్మాట్లో కూడా అదరగొడుతూ టీమిండియా విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అందుకే విరాట్ కోహ్లీ లేని టీమ్ ఇండియా జట్టును అటు అభిమానులు అస్సలు ఊహించుకోలేరు. అయితే అందరూ ఆటగాళ్లు గాయం బారిన పడుతూ అప్పుడప్పుడు జట్టుకు దూరం అవడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ విరాట్ కోహ్లీ మాత్రం గాయం బారిన పడటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా జట్టుకు అందుబాటులో ఉండలేదు అంటే అది వ్యక్తిగత కారణాలతోనే తప్ప ఇంకే కారణం ఉండదు.

 అయితే ఇక ఇప్పుడు భారత జట్టు ఇండియా పర్యటనకు వచ్చింది. ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా అటు విరాట్ కోహ్లీ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు అందుబాటులో లేడు. వ్యక్తిగత కారణాలతో అతను జట్టుకు దూరంగానే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో అతను లేని టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్ లో తడబడి ఓడిపోయింది. అయితే మొదటి రెండు టెస్టులకు అందుబాటులో లేకపోయినా.. మిగిలిన మూడు టెస్టులకు అతను జట్టులోకి వచ్చేస్తాడు అని అందరూ ఆశలు పెట్టుకున్నారు.

 కానీ అందరి ఆశలు అడియాశలు అయ్యేలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మిగిలిన టెస్ట్ మ్యాచ్లకు కూడా అతను అందుబాటులో ఉండడం కష్టమే అన్నది తెలుస్తుంది. ఏకంగా తన తల్లి లివర్ సమస్యతో బాధపడుతున్నందుకు విరాట్ కోహ్లీ బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. ఆమె పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఇక ఈ సిరీస్ లోని మిగతా మూడు టెస్టులకు కూడా విరాట్ కోహ్లీ దూరమయ్యే అవకాశం ఉందట. మరోవైపు ఇప్పటివరకు తన రీ ఎంట్రీ గురించి విరాట్ కోహ్లీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బీసీసీఐ అధికారి అధికారి ఒకరు తెలిపారు. కాగా ఇప్పటికే జట్టుకు రవీంద్ర జడేజా, కే.ఎల్ రాహుల్ లాంటి కీలక ప్లేయర్ల దూరం కాగా ఇక విరాట్ కోహ్లీ కూడా మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండడు అని తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: