నా సోదరుడు.. నాకంటే మంచి బ్యాట్స్మెన్ : సర్పరాజ్

praveen
భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా ఒక ఆటగాడు గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఆ ఆటగాడు ఎవరో కాదు సర్పరాజ్ ఖాన్. ఏకంగా టీమిండియా దేశాలు క్రికెట్లో సెన్సేషనల్ ప్లేయర్గా గుర్తింపును సంపాదించుకున్న అతను ఏకంగా తన ఆట తీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అని చెప్పారు. అయితే దేశవాళి క్రికెట్లో అతను అదరగొడుతున్నప్పటికీ ఎందుకో సెలెక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోలేదు

 అయితే దేశవాళీ క్రికెట్లో ఎంతలా పరుగుల వరద పారించిన టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలి అనేకళ సర్ఫరాజ్ కు తీరలేదు అని చెప్పాలి. అయితే ఇటీవల ఊహించిన విధంగా టీమిండియా నుంచి ఈ స్టార్ ప్లేయర్ పిలుపు వచ్చింది అని చెప్పాలి.  రెండో టెస్ట్ మ్యాచ్ లో అతను అందుబాటులో ఉండబోతున్నారు. ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే సర్పరాజ్  తన బ్యాటింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సోదరుడు ముషీర్ ఖాన్ తనకంటే మంచి బ్యాట్స్మెన్ అంటూ సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు. తను ఫామ్ లో లేని సమయంలో తన సోదరుడు ముషీర్ ఖాన్ బ్యాటింగ్ టెక్నిక్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు.  ముషీర్ ఖాన్ రివర్స్ స్వీప్ తనకంటే బాగా ఆడతాడు అంటూ సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా రాహుల్, జడేజా లాంటి ఇద్దరు ప్లేయర్లు గాయపడటంతో చివరికి సర్పరాజ్ ఖాన్ ను  జట్టులోకి తీసుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే అతనికి టీమిండియాలో చోటు దక్కినప్పటికీ తుది జట్టులోకి తీసుకుంటారు లేదా అనే విషయంపై చర్చ జరుగుతుంది. ఒకవేళ అతన్ని తుది జట్టులోకి  తీసుకోకపోతే సెలక్టర్లు తీరిఫై విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. అయితే అతని అభిమానులు మాత్రం తప్పకుండా జట్టులో చోటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: