రోహిత్ కు బదులు.. అతన్ని ఓపనర్ గా పంపండి : వసీం జాఫర్

praveen
గత కొంతకాలం నుంచి వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ అదరగొడుతున్న టీమిండియా.. ఇక ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో ముందుకు వెళ్లాలంటే టీమిండియా కు ఈ టెస్టు సిరీస్ లో విజయం సాధించడం ఎంతో కీలకమని చెప్పాలి. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత జట్టు అద్భుతంగా రాణిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన రీతిలో మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే దారుణంగా విఫలమైంది. దీంతో ఇక టీమిండియా కు సొంత గడ్డమీద పరాజయం తప్పలేదు .

 అయితే ఇప్పుడు వరకు ఎన్నో  జట్లతో ఉప్పల్ స్టేడియం వేదికగా పలుమార్లు టెస్ట్ మ్యాచ్లు ఆడింది టీం ఇండియా. కానీ ఒక్కసారి కూడా ఇక్కడ ఒక్క మ్యాచ్లో ఓడిపోలేదు. కానీ మొదటిసారి ఉప్పల్ స్టేడియంలో పేలవ ప్రదర్శనతో పరాజయం పాలు అయింది టీమ్ ఇండియా  మొదటి టెస్ట్ మ్యాచ్లో రోహిత్, జైష్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఈ ఇద్దరు కూడా ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. జైష్వాల్ మొదటి ఇన్నింగ్స్ లో పర్వాలేదు అనిపించిన.. రెండో ఇన్నింగ్స్ లో తేలిపోయాడు. ఇక రోహిత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న గిల్ వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చి ఎక్కడ ఆకట్టుకోలేకపోయాడు.

 ఈ క్రమంలోనే మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన టీమ్ ఇండియా.. రెండో టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తే బాగుంటుంది అని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రెండో టెస్టులో గిల్ ను ఓపెనర్ గా ఆడిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. గిల్, జైష్వాల్ ఓపెనింగ్ చేయాలని.. రోహిత్ శర్మ మూడో స్థానంలో బ్యాటింగ్ కి రావాలి అంటూ సూచించాడు. బ్యాటింగ్ కోసం వేచి చూడడం వల్ల గిల్ సరిగ్గా ఆడలేక పోతున్నాడు. రోహిత్ స్పిన్ బాగా ఆడతాడని.. మూడో స్థానంలో ఆడటంలో అతడికి ఎలాంటి సమస్య ఉండదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు వసీం జాఫర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: