కోహ్లీ ఆట చూడటం.. నా అదృష్టం : గంగూలీ

praveen
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది సార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ కోహ్లీ స్థానం మాత్రం అందరిలో కెల్లా టాప్ లో ఉంటుంది. అయితే క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే ఎంతో మంది లెజెండ్స్ సాధించిన రికార్డులను బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ. అయినప్పటికీ అటు కోహ్లీకి ఇంకా పరుగుల దాహం తీరలేదు అన్నట్లుగానే ప్రతి మ్యాచ్ లో కూడా కనబడుతూ ఉంటాడు.

 అందుకే విరాట్ కోహ్లీని అభిమానులు అందరూ కూడా రన్ మిషన్ అని పిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. మరోవైపు ఇక ఆట విషయంలోనే కాదు సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకోవడంలో కూడా విరాట్ కోహ్లీని మించినోడు నేటి తరంలో ఎక్కడా లేడు. ఇక ఫిట్నెస్ విషయంలో కూడా కోహ్లీ మిగతా ఆటగాళ్లకు పూర్తిగా నిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. సాధారణంగా ఏ ఆటగాడు అయినా అప్పుడప్పుడు గాయపడిన పడటం చూస్తూ ఉంటాము. కానీ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో కొన్నాళ్ళు లీవ్ తీసుకోవడం తప్ప గాయం బారిన పడి జట్టుకు దూరమైన సందర్భాలు చాలా అరుదు.

 అయితే విరాట్ కోహ్లీ ఆట తీరుపై మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఇదే విషయం పై స్పందించిన భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు.  ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోహ్లీ బ్యాటింగ్ చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. పరుగుల కోసం అతని ఆకలి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గ్రౌండ్ లోనే కాకుండా బయట కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు అంటూ సౌరబ్ గంగూలీ ప్రశంసలు గుర్తించాడు. ఇకపోతే విరాట్ కోహ్లీ ఇటీవల వ్యక్తిగత కారణాలతో అటు టీమ్ ఇండియా ఆడుతున్న రెండు టెస్ట్ మ్యాచ్లకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: