12 ఏళ్ల తర్వాత.. టీమిండియా ఆ విషయంలో చెత్త రికార్డు?

praveen
గత కొన్ని నెలల నుంచి భారత గడ్డపై టీమిండియా ఆడిన టెస్ట్ మ్యాచ్లలో జైత్రయాత్రను కొనసాగిస్తూ వస్తుంది భారత జట్టు. ఎందుకంటే ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తూ సొంత గడ్డపై ఓటమి ఎరుగని జట్టుగా మారిపోయింది అని చెప్పాలి. కాగా 12 ఏళ్లలో ఒక్కసారి కూడా భారత జట్టు సొంత గడ్డపై జరిగిన టెస్ట్ మ్యాచ్లలో వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోలేదు   కానీ మొదటిసారి ఇటీవల ఇంగ్లాండు జట్టు భారత జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్, టీమిండియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది.

 అయితే ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చింది ఇంగ్లాండ్ జట్టు. టీమిండియా ప్లేయర్స్ అందరూ కూడా అటు మంచి ఫామ్ లో ఉండడంతో ఇంగ్లాండు జట్టు భారత్ ను ఓడించడం అంత సులభమైన విషయం కాదు అని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో అద్భుతమైన పోరాట పట్టిమను కనబరిచిన ఇంగ్లాండ్ జట్టు ఎంతో అలవోకగా భారత్ పై విజయం సాధించింది అని చెప్పాలి. మొదటి ఇన్నింగ్స్ లో కాస్త తడబడినట్లు కనిపించినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుతంగా పుంజుకుంది ఇంగ్లాండ్ జట్టు. దీంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత తొలిసారి భారత జట్టుకు ఓటమి ఎదురైంది అని చెప్పాలి.

 అయితే స్వదేశంలో వరుసగా మూడు టెస్టుల్లో భారత జట్టు విజయం సాధించకపోవడం.. గత 12 ఏళ్లలో ఇదే తొలిసారి గత మూడు టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఒకటి ఓడిపోగా, అదే జట్టుతో ఒక మ్యాచ్ డ్రాగ ముగిసింది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో భారత జట్టు ఓడిపోయింది అని చెప్పాలి. ఇటీవల హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో  ఓడిపోయింది. అయితే ఉప్పల్ స్టేడియంలో జరిగిన ప్రతి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఘనవిజయం సాధించేది. కానీ మొదటిసారి ఉప్పల్ స్టేడియంలో టీం ఇండియా ఓడిపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: