లంక క్రికెట్ బోర్డుకి.. గుడ్ న్యూస్ చెప్పిన ఐసీసీ?

praveen
ఒకప్పుడు ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్ టోర్నీలలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగేది శ్రీలంక జట్టు. అంతేకాదు ఇక అటు వరల్డ్ కప్ టైటిల్ ని కూడా ఓసారి గెలుచుకొని.. ఛాంపియన్ జట్టుగా కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతిసారి శ్రీలంక టీం పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉంటాయి. కానీ గత కొంతకాలం నుంచి ఎందుకో శ్రీలంక క్రికెట్ టీం ఆశించినంత స్థాయిలో రాణించలేక పోతుంది. ఈ క్రమంలోనే చెత్త ప్రదర్శనలు చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే ఇక గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్స్ టోర్నీలో కూడా శ్రీలంక దారుణమైన ప్రస్థానాన్ని  కొనసాగించింది అన్న విషయం తెలిసిందే.

 ఎక్కడ ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేక వరుస పరాజయాలు సాధిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. అంతేకాకుండా కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టలేక లీగ్ దశ నుంచి నిష్క్రమించింది. అయితే ఇలా వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించి శ్రీలంక జట్టు స్వదేశానికి చేరుకుందో లేదో అంతలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే క్రికెట్ బోర్డు నిర్వహణ విషయంలో రాజకీయ జోక్యం ఎక్కువ అవడంతోనే ఐసిసి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వివరణ కూడా ఇచ్చింది.

 అయితే ఇక శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఐసిసి ఉంది అంటూ గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ విషయంలో లంకా బోర్డుకి గుడ్ న్యూస్ అందింది. ఏకంగా లంక క్రికెట్ బోర్డుపై ఉన్న నిషేధాన్ని ఐసిసి ఎత్తివేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది అంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. అయితే గతంలో బోర్డు వ్యవహారాలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లాంటి కారణాలతో నవంబర్లో నిషేధం విధించగా.. ఇక ఈ నిషేధం తర్వాత బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడంతో ఈ బ్యాన్ ఎత్తివేస్తున్నట్లు ఐసిసి తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: