టీమిండియాకు ఇక్కడ నిరాశ.. అక్కడ ఆనందం?

praveen
ప్రస్తుతం భారత సీనియర్ క్రికెటర్ల జట్టు ఇంకోవైపు అండర్ 19 కుర్రాళ్ల జట్టు క్రికెట్ మ్యాచ్లతో బిజీబిజీగా ఉన్నాయి అని చెప్పాలి. ప్రస్తుతం భారత సీనియర్ జట్టు ఇంగ్లాండుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక ఇండియా వేదికగా ఈ టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ఇటీవల ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా చివరికి ఓటమి చవి చూసింది. అయితే మరోవైపు అండర్ 19 వరల్డ్ కప్ లో ఆడుతున్న కుర్రాళ్ల జట్టు మాత్రం అదరగొట్టేస్తుంది. ఒక్క ఓటమి లేకుండా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో ఎలా అయితే టీమ్ ఇండియా సీనియర్ టీం ప్రస్తానాన్ని కొనసాగించిందో.. ఇక ఇప్పుడు కుర్రాళ్ళు కూడా అలాగే కుమ్మేస్తున్నారు.

 ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో భారత జైత్రయాత్రకు బ్రేక్ వేసే టీం లేకుండా పోయింది అని చెప్పాలి. ఇటీవల యూఎస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 201 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది టీమిండియా. ఇక ఇప్పటికే వరుసగా రెండు విజయాలు సాధించి పాయింట్లు పట్టికలో టాప్ లో కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే భారత కుర్రాళ్ల జోరు చూస్తుంటే ఈసారి కూడా టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు ఇక అదే స్థాయిలో ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి.

 అయితే ఇటీవల యూఎస్ఏ తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు తొలిత బ్యాటింగ్ చేసింది   ఈ క్రమంలోనే నిర్ణీత 50 ఓవర్లలో 326 పరుగులు చేసింది టీమిండియా కుర్రాళ్ళ జట్టు. అయితే భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన యూఎస్ఏ జట్టు ఏ దశలో కూడా టీమిండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలోనే 50 ఓవర్లలో 125 / 8 పరుగులకు మాత్రమే పరిమితమైంది. కాగా ఇండియా బౌలర్లలో నితీష్ తివారి నాలుగు  వికెట్లతో సత్తా చాటాడు అని చెప్పాలి. వరుసగా మూడు విజయాలు సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: