సన్రైజర్స్ ప్లేయర్ వీర బాదుడు.. కేవలం 16 బంతుల్లోనే?

praveen
సాధారణంగా టి20 ఫార్మాట్లో బ్యాటర్లదే ఆదిపత్యం కొనసాగుతూ ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇది ముమ్మాటికీ నిజమే అని ఎంతోమంది బ్యాట్స్మెన్లు నిరూపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే టి20 ఫార్మాట్లో క్రీజులోకి బ్యాటింగ్ చేయడానికి వచ్చే బ్యాట్స్మెన్ కి పెద్దగా సమయం కానీ ఎక్కువ బంతులు కాని ఉండవు. క్రీజ్ లో ఎంతసేపు ఉన్నాము అన్నది కాకుండా ఉన్నంతసేపు ఎంతలా వీరబాదుడు బాదాము అన్నదే టి20 ఫార్మాట్లో ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ఫార్మాట్లో ఆడే ప్రతి బ్యాట్స్మెన్ కూడా మొదటి బంతి నుండి సిక్సర్లు పోర్లతో చలరేగిపోవడం చూస్తూ ఉంటాం.

 అయితే ఇక ఇప్పుడు కేవలం అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు మాత్రమే కాదు.. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రత్యేకంగా t20 టోర్నిలు నిర్వహిస్తూ ఉన్నాయి. అయితే ఈ టి 20 టోర్నీలలో ఇక అన్ని దేశాలకు సంబంధించిన ఆటగాళ్లు కూడా భాగం అవుతూ.. ఓకే టీం తరపున ఆడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే అచ్చం బిసిసిఐ నిర్వహించే ఐపిఎల్ తరహాలోనే సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు కూడా సౌత్ ఆఫ్రికా టీ20 టోర్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇక ఈ టి20 టోర్నీలోని ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉండడం గమనార్హం. ఇటీవల ఈ టోర్నీలో ఒక ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదయింది.

 దర్బన్ సూపర్ జెయింట్స్ ప్లేయర్ హెనరిచ్ క్లాసేన్  తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు అని చెప్పాలి. పార్ల్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు రెండు ఫోర్లు ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా t20 టోర్నీలో ఇక అతను కొట్టిన హాఫ్ సెంచరీనే పాస్టెస్ట్  ఫిఫ్టీగా రికార్డ్ సృష్టించింది. కాగా క్లాసిన్ ఐపిఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిత్యం వహిస్తున్నాడు  అని చెప్పాలి  అయితే ఇక అతని వీర బాదుడు చూసి ప్రస్తుతం సన్రైజర్స్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఇక ఈ ఐపీఎల్లో అతని బ్యాటింగ్ విధ్వంసం ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: